Sudheer-Rashmi: ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పబోతున్న సుధీర్-రష్మీ.. హింట్ ఇచ్చేశారుగా?

by Hamsa |
Sudheer-Rashmi: ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పబోతున్న సుధీర్-రష్మీ.. హింట్ ఇచ్చేశారుగా?
X

దిశ, సినిమా: సుడిగాలి సుధీర్(Sudigali Sudheer), రష్మీ గౌతమ్(Rashmi Gautam) ప్రేమించుకుంటున్నారంటూ గత కొద్ది రోజుల నుంచి వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ జంట షో పేరుతో పెళ్లి కూడా చేసుకున్నారు. అంతేకాకుండా కొన్నేళ్లుగా బుల్లితెరపై పలు కార్యక్రమాల్లో యాంకర్స్‌గా వ్యవహరించి ఎంతోమంది ప్రేక్షకులకు దగ్గరయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో వీరికి కొన్ని లక్షల మంది ఫ్యాన్స్ ఉన్నారనడంలో అతిశయోక్తి లేదు. అయితే వీరి మధ్య వచ్చే లవ్ సీన్లు, పలు సన్నివేశాలు చూసిన వారంతా ప్రేమించుకుంటున్నారనే అనుకుంటారు. ఇన్నాళ్లు అవుతున్నప్పటికీ వీరి ప్రేమకు సంబంధించిన ఏదో ఒక వార్త వస్తూనే ఉంది.

వారు స్పందించి క్లారిటీ ఇచ్చినప్పటికీ వార్తలకు చెక్ పడటం లేదు. సుధీర్, రష్మి హీరో, హీరోయిన్స్ అంత పాపులారిటీ సంపాదించుకున్నారు. అయితే గత కొద్ది రోజుల నుంచి రష్మీ బుల్లితెరపై పలు షోలు చేస్తోంది. ఇక సుధీర్ మాత్రం హీరోగా పలు సినిమాల్లో నటిస్తున్నాడు. కొన్ని చిత్రాలు ఆగిపోయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో.. తాజాగా, వీరిద్దరూ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. ‘సంక్రాంతి వస్తున్నాం’ పేరుతో ఓ స్పెషల్ ప్రోగ్రాం రాబోతుంది. అయితే ఇందులో సుధీర్, రష్మీ జంటగా మరోసారి కనిపించారు.

అంతేకాకుండా నాగచైతన్య(Nagachaitanya) నటిస్తున్న ‘తండేల్’ బుజ్జితల్లి సాంగ్‌కు డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన విడుదల కావడంతో అది చూసిన వారంతా వీరి ప్రేమ కన్ఫామ్ అని అంటున్నారు. ఈ షో ద్వారా హింట్ ఇచ్చారని అంతా చర్చించుకుంటున్నారు. త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని అంటున్నారు. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించిన వార్తలు మాత్రం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Next Story