కొత్త సంవత్సరం నాడు గుడ్ న్యూస్ ప్రకటించిన స్టార్ హీరోయిన్.. వీడియో వైరల్

by Hamsa |
కొత్త సంవత్సరం నాడు గుడ్ న్యూస్ ప్రకటించిన స్టార్ హీరోయిన్.. వీడియో వైరల్
X

దిశ, సినిమా: ఇలియానా(Ileana D'Cruz) ‘దేవదాసు’(Devadasu) సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. మొదటి మూవీతోనే హిట్ అందుకుని కుర్రకారు ఫేవరేట్ బ్యూటీగా మారిపోయింది. ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించి తన అందం, అభినయం నటనతో వరుస ఆఫర్లు అందుకుని స్టార్ హీరోయిన్‌గా కొద్ది కాలంపాటు ఇండస్ట్రీలో రాణించింది. కానీ ఆ తర్వాత దక్షిణాదిలో ఆమెను బ్యాన్ చేయడంతో బాలీవుడ్‌కు చెక్కేసింది. అక్కడ కూడా పెద్దగా ఆఫర్లు రావపోవడంతో సినిమాలకు దూరం అయింది. ఇక పెళ్లి కాకుండానే గత ఏడాది సడెన్‌గా ప్రెగ్నెంట్(Pregnant) అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతో హాట్ టాపిక్‌గా మారింది. ఆ తర్వాత తన భర్త ఫొటోను రివీల్ చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఓ బాబుకు జన్మనిచ్చిన ఇలియానా మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తూ సోషల్ మీడియాలో పలు పోస్టులు షేర్ చేస్తుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఇలియానా మరోసారి తల్లి కాబోతున్నట్లు గుడ్ న్యూస్ ప్రకటించింది. 2024 గురించి చిన్నపాటి వీడియో రిలీజ్ చేసి ప్రెగ్నెన్సీపై హింట్ ఇచ్చింది. జనవరి నుంచి డిసెంబర్ వరకు జీవితం ఎలా ఉందో చూపించింది. జనవరి నుంచి సెప్టెంబర్ వరకు నా పిల్లాడితోనే క్షణం తీరిక లేకుండా గడిచిపోయాయి. అలాగే నా భర్తతో ఎంజాయ్ చేస్తున్నాను. ఇక సెప్టెంబర్‌లో మాత్రం మరోసారి గర్భం దాల్చానంటూ ప్రెగ్నెన్సీ కిట్ చూపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో నెటిజన్లు కొద్ది రోజుల్లో బుజ్జి ఇలియానా రాబోతున్నందుకు శుభాకాంక్షలు అని కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed