- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
తన క్యూట్ స్మైల్‌తో కుర్రాళ్ల మనసుల్ని కొల్లగొట్టేస్తున్న సీత.. ఇంట్రెస్టింగ్ ఫొటోలు వైరల్

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ అంజలి(Anjali) అందరికి సుపరిచితమే. ‘షాపింగ్ మాల్’(Shopping Mall) సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ బ్యూటీ తన మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వెంకటేష్(Venkatesh), మహేష్ బాబు(Mahesh Babu) నటించిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’(Seethamma Vakitlo Sirimalle Chettu) మూవీతో మరింత పాపులారిటీ తెచ్చుకుంది. దీంతో వరుస ఆఫర్స్ రావడంతో బాలకృష్ణ(Balakrishna), వెంకటేష్, పవన్ కళ్యాణ్(Pawan Kalyan) వంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది.
కానీ అనుకున్నంత స్టార్ డమ్ అయితే రావట్లేదనే చెప్పాలి. తెలుగు అమ్మాయే అయినప్పటికీ మన టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ క్రేజ్ తెచ్చుకోలేకపోతుంది. అయితే గత ఏడాది ‘గ్యాంగ్ ఆఫ్ గోదావరి’(Gangs Of Godavari) చిత్రంలో తన నటనతో అలరించిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) నటించిన ‘గేమ్ ఛేంజర్’(Game Changer) సినిమాలో నటించింది. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్(Shankar) తెరకెక్కించిన ఈ చిత్రంలో కియారా అద్వానీ(Kiara Advani) హీరోయిన్‌గా నటించింది. అయితే సంక్రాంతి కానుకగా ఎన్నో ఆశలతో జనవరి 10న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా ఊహించని రేంజ్‌లో ప్లాప్ అయింది.
అలాగే పలు ట్రోల్స్ కూడా ఎదుర్కొంది. అలా విడుదల అయి నెల రోజులు కాకముందే ఫిబ్రవరి 7నుంచి ఓటీటీ(OTT)లోకి స్ట్రీమింగ్ అవుతుంది. అక్కడ కూడా ఓకే ఓకే టాక్ తెచ్చుకుంటుంది. కానీ అంజలి, విశాల్(Vishal), వరలక్ష్మి శరత్ కుమార్(Varalakshmi Sarathkumar) నటించిన ‘మద గజ రాజా’(Madagaja raja) సినిమా ఏకంగా 12 ఏళ్ల తర్వాత థియేటర్లలో రిలీజ్ అయితే బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ లేటెస్ట్ ఫొటోస్, వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఉంటుంది అంజలి.
ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా అంజలి తన సామాజిక మాధ్యమాల్లో కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో రెడ్ కలర్ శారీ కట్టుకొని క్యూట్ స్మైల్‌తో ఫొటోస్‌కి స్టిల్స్ ఇచ్చింది. అంతేకాకుండా వయ్యారాలు వలకబోస్తూ కుర్రాళ్ల మనసుల్ని కొల్లగొట్టేస్తుంది. ఇక వాటికి ‘సీత అండ్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు సినిమాను మరోసారి జరుపుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈ విడుదల అన్నింటికంటే గొప్పగా అనిపించింది. మీ అందరినీ ప్రేమిస్తున్నాను’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఇక వాటిని చూసిన నెటిజన్లు వావ్ సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు ఈ బ్యూటీ పోస్ట్ పై ఓ లుక్ వేసేయండి.
READ MORE ...
గుడ్ న్యూస్ ప్రకటించిన టాలీవుడ్ బ్యూటీ.. ఎమోషనల్ పోస్ట్ వైరల్