- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Siddu Jonnalagadda: జాక్ ‘కిస్ సాంగ్’ కు ముహూర్తం ఫిక్స్.. లేటెస్ట్ పోస్టర్ వైరల్

దిశ, సినిమా: స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘జాక్’ (Jack). ‘కొంచెం క్రాక్’ అనే ట్యాగ్ లైన్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీకి బొమ్మరిల్లు భాస్కర్ (Bommarillu Bhaskar) దర్శకత్వం వహిస్తుండగా.. ఇందులో యంగ్ బ్యూటీ వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) హీరోయిన్‌గా నటిస్తుంది. ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నేతృత్వంలోని అగ్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర నిర్మిస్తోన్న ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తి చేసుకుంది. అలాగే.. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్‌డేట్స్ ప్రేక్షకులను ఆకట్టుకోగా.. ‘జాక్’ చిత్రం ఏప్రిల్ 10న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కానుంది.
ఈ క్రమంలోనే వరుస అప్‌డేట్స్ ఇస్తున్నారు చిత్ర బృందం. ఇందులో భాగంగా తాజాగా ‘కిస్ సాంగ్’ (Kiss Song) మార్చి 17న రాబోతున్నట్లు ఇప్పటికే మూవీ టీమ్ ప్రకటించగా.. రిలీజ్ వాయిదా పడింది. తాజాగా ఈ సాంగ్ కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తూ న్యూ పోస్టర్ విడుదల చేశారు. ఈనెల 20న(రేపు) ఉదయం 9 గంటలకు ఆర్కే సినీప్లెక్స్‌లో ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ (Launch event) జరగుతున్నట్లు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన లేటెస్ట్ పోస్టర్ నెట్టిం విశేషంగా ఆకట్టుకుంటోంది.