‘5-10 మంది పిల్లలనైనా కనాలని ఉంది’.. టాలీవుడ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్(పోస్ట్)

by Kavitha |
‘5-10 మంది పిల్లలనైనా కనాలని ఉంది’.. టాలీవుడ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్(పోస్ట్)
X

దిశ, సినిమా: 2005లో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ సనా ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ తర్వాత కళ్యాణ్ రామ్ నటించిన ‘కత్తి’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఇక తన ఫస్ట్ మూవీతోనే ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. దీంతో ఈ భామకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా ‘మిస్టర్ నూకయ్య’, ‘గగనం’ వంటి సినిమాల్లో నటించి మంచి ఫేమ్ తెచ్చుకుంది. అయితే టాలీవుడ్‌లో ఓ మెరుపు మెరిసిన ఈ బ్యూటీ తర్వాత కనిపించకుండా కనుమరుగైపోయింది. ఇక కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుంది. కాగా వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌‌గా ఉంటూ తన అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

రీసెంట్‌గా తన ఇన్‌స్టా గ్రామ్‌లో సనాఖాన్ ఓ వీడియో షేర్ చేసింది. అందులో సనా మాట్లాడుతూ.. ‘నేను ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లలకు జన్మ ఇవ్వాలనుకుంటున్నాను. ఆ సంఖ్య ఐదు కావొచ్చు.. పది కావొచ్చు. పూర్వకాలంలో మహిళలు 12-12 మంది పిల్లలను ప్రసవించే వారట. నేను గర్భం ధరించినప్పటి నుంచి నా భర్త అనాస్ నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. నాకు డెలివరీ అయ్యే వరకు కంటికి రెప్పలా నా వెంటే ఉన్నాడు’ అని చెప్పుకొచ్చింది. దీంతో ఈమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఇక దీనిపై నెటిజన్లు ఆమెను బాగా ట్రోల్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed