Shahid Kapoor: ‘సమాజంలో ఇలాంటి అబ్బాయిలు కూడా ఉంటారా అనుకున్న.. కానీ?’.. బాలీవుడ్ హీరో సెన్సేషనల్ కామెంట్స్

by Anjali |   ( Updated:2024-12-04 06:29:48.0  )
Shahid Kapoor: ‘సమాజంలో  ఇలాంటి అబ్బాయిలు కూడా ఉంటారా అనుకున్న.. కానీ?’.. బాలీవుడ్ హీరో సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్(Shahid Kapoor) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈ నటుడు .. విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ చిత్రం అర్జున్ రెడ్డి(Arjun Reddy) రీమేక్‌లో నటించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా షాహిద్ కపూర్ ఓ ఇంటర్వ్యూకు హాజరై ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ చిత్రంలో చూపించిన అర్జున్ రెడ్డిలా సొసైటీలో నిజంగానే అలాంటి అబ్బాయిలు ఉన్నారని వెల్లడించారు. అర్జున్ రెడ్డిలో పలు సీన్స్ నాకు నచ్చలేదని కానీ నిజజీవితంలో అలాంటి అబ్బాయిలు ఉన్నారనన్నారు. మనం ఎలా ఉండాలన్నది పూర్తిగా అది మన డెసిషన్‌పైనే డిపెండ్ అయి ఉంటుందని వెల్లడించారు. అయినా రియల్ లైఫ్‌లో అలాంటి సంఘటనలు జరగకపోతే.. సినిమాలు ఎలా తీస్తారని పేర్కొన్నారు. ఈ మూవీ స్క్రిప్ట్ విన్నప్పుడు కూడా అలాంటి అబ్బాయిలు ఉంటారా? వారితో అమ్మాయిలు లవ్‌‌లో పడుతారా? అని భావించానని తెలిపారు. కానీ నాకు తర్వాత తెలిసిందని అన్నారు. ఇక కబీర్ సింగ్(Kabir Singh) చిత్రం 2019 లో రిలీజై.. ఏకంగా 379 కోట్ల రూపాయల వసూళ్లు కొల్లగొట్టింది. ఈ బ్లాక్ బస్టర్ చిత్రంలో షాహిద్ కపూర్ హీరోగా.. కియారా అడ్వాణి(Kiara Advani) కథానాయికగా నటించారు.

Advertisement

Next Story

Most Viewed