రాబిన్‌హుడ్ నుంచి సెకండ్ సింగిల్ అప్‌డేట్.. బ్రాండ్స్ మీద సాంగ్ ఏంటీ బ్రో అంటున్న నెటిజన్లు!

by sudharani |   ( Updated:2025-02-13 12:36:37.0  )
రాబిన్‌హుడ్ నుంచి సెకండ్ సింగిల్ అప్‌డేట్.. బ్రాండ్స్ మీద సాంగ్ ఏంటీ బ్రో అంటున్న నెటిజన్లు!
X

దిశ, సినిమా: యంగ్ హీరో నితిన్ (Nithin) ప్రజెంట్ ‘రాబిన్‌హుడ్’(Robinhood) చిత్రంతో బిజీగా ఉన్నాడు. శ్రీలీల (Sreeleela) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీకి వెంకీ కుడుముల (Venky Kudumula) దర్శకత్వం వహిస్తుండగా.. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ మూవీ సమ్మర్ స్పెషల్‌గా మార్చి 28న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. దీంతో వరుస అప్‌డేట్స్ ఇస్తు్న్నారు చిత్ర బృందం. ఇప్పటికే ఈ మూవీ నుంచి టీజర్, ట్రైలర్‌తో పాటు ఫస్ట్ సింగిల్ కూడా రిలీజ్ కాగా.. సోషల్ మీడియాలో మంచి స్పందన వచ్చింది.

ఇదే జోష్‌తో తాజాగా సరికొత్తగా సెకండ్ సింగిల్ అప్‌డేట్ ఇచ్చారు చిత్ర బృందం. ఇందులో మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ (Music director GV Prakash) ఓ ట్యూన్ రెడీ చేస్తుండగా.. పక్కన డైరెక్టర్ వెంకీ కుడుముల తీవ్రంగా ఏదో థింక్ చేస్తున్నాడు. ఇంతలో డైరెక్టర్‌కు హీరో నితిన్ కాల్ చేసి.. ‘ఈ సాంగ్‌తో మన పబ్లిసిటీ ఫుల్ బూస్ట్ అయిపోవాలి.. ఈ రోజు జిమ్‌లో ఫుల్ టైడ్ అయిపోయాను.. సూటిగా సుత్తి లేకుండా సాంగ్ తీసుకుని రా’ అని మాట్లాడి కట్ చేస్తాడు. ఇక నితిన్ మాటల్లోని బూస్ట్, టైడ్, సూటిగా సుత్తి లేకుండా అనే పదాలు లైన్ చేసుకుని బ్రాండ్స్ మీద ఒక సాంగ్ చేద్దాం అని జీవి ప్రకాష్‌తో చెప్తాడు వెంకీ. ఇక అక్కడితో వీడియో కట్ చేస్తూ.. సెకండ్ సింగిల్ ప్రోమో రేపు (13-02-2025) రాబోతున్నట్లు.. ఫుల్ లిరికల్ ఫిబ్రవరి 14న రాబోతున్నట్లు అనౌన్స్ చేశారు. ప్రజెంట్ ఈ వీడియో వైరల్ అవుతుండగా.. ‘బ్రాండ్స్ మీద సాంగ్ ఏంటీ బ్రో..’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.

Next Story

Most Viewed