Sai Pallavi: అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సాయి పల్లవి.. ఆందోళన చెందుతున్న అభిమానులు (వీడియో)

by Hamsa |
Sai Pallavi: అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న సాయి పల్లవి.. ఆందోళన చెందుతున్న అభిమానులు (వీడియో)
X

దిశ, సినిమా: నేచురల్ బ్యూటీ సాయి పల్లవి(Sai Pallavi) ‘ప్రేమమ్’ హీరోయిన్‌గా పరిచయం అయి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇక ‘ఫిదా’(Fida) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయి ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. తన అందం, నటనతో ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేసింది. దీంతో అమ్మడుకు వరుస అవకాశాలు వరించాయి. ఆ తర్వాత మిడిల్ క్లాస్ అబ్బాయ్, పడిపడిలేచే మనసు వంటి చిత్రాలు చేసింది. ఇక ‘శ్యామ్ సింగరాయ్’ లవ్ స్టోరీ సినిమాలతో హిట్ సాధించి స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ఇక 2022లో ‘గార్గి’ మూవీ చేసింది. కానీ హిట్ అందుకోలేకపోయింది. దీంతో ఏడాది పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. గత ఏడాది ఈ అమ్మడు ‘అమరన్’(Amaran) మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అయితే ఇందులో శివకార్తికేయన్ హీరోగా నటించగా.. ముకుంద్ వరదరాజన్(Mukund Varadarajan) జీవిత కథ ఆధారంగా రాజ్ కుమార్ పెరియ స్వామి(Rajkumar Periya Swamy) తెరకెక్కించారు. ‘అమరన్’ చిత్రం గత ఏడాది విడుదలై ఘన విజయాన్ని అందుకుంది. అంతేకాకుండా ఎంతో మంది సినీ ప్రియుల హృదయాలను కొల్లగొట్టింది. ఆ తర్వాత ఓటీటీలోకి కూడా వచ్చి ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. కొంతమంది ‘అమరన్’ చూశాక కన్నీరు మున్నీరు అయ్యారనడంలో అతిశయోక్తి లేదు. ఇక సాయి పల్లవికి ఈ మూవీ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఫుల్ క్రేజ్ పెరిగిపోయింది. అయితే ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండనప్పటికీ పలు వీడియోలను నెటిజన్లు వైరల్ చేస్తుంటారు.

ఇక సాయి పల్లవి సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం తెలుగులో ఈ భామ ‘తండేల్’(Thandel) మూవీ చేస్తుంది. ఇందులో నాగచైతన్య(Naga Chaitanya) హీరోగా నటిస్తుండగా.. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే దీనిని గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్(Allu Aravind) నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ‘తండేల్’ ఫిబ్రవరి 7నథియేటర్స్‌లోకి రానుంది. అయితే మూవీ మేకర్స్ వరుస అప్డేట్స్ విడుదల చేస్తూ హైప్ పెంచుతున్నారు. నేడు జనవరి 28న ట్రైలర్‌ను వైజాగ్‌లో లాంచ్ చేయనున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా, సాయి పల్లవి ‘తండేల్’ మూవీకి డబ్బింగ్ చెబుతున్న వీడియో చిత్ర యూనిట్ షేర్ చేసింది. ఇందులో సాయి పల్లవి దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతూనే డబ్బింగ్ చెప్తుండగా.. డైరెక్టర్ చందూ మొండేటి ఆమెను ఆటపట్టిస్తున్నారు. ఇక సాయి పల్లవి 10 రోజుల నుంచి అనారోగ్య సమస్యలతో చేస్తున్నా కానీ ఏం కాలేదు ఈ రోజు కొత్తగా ఉంది అంటుంది. అప్పుడు డైరెక్టర్ ఇలా ఉంటుంది మా ర్యాగింగ్ అని అంటారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుండగా అది చూసిన సాయి పల్లవి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయ్యో జాగ్రత్తగా ఉండండి అని కామెంట్లు చేస్తున్నారు.



Next Story

Most Viewed