Thandel : " తండేల్ జాతర " లో మాస్ స్టెప్పులేసిన సాయి పల్లవి, నాగ చైతన్య ( వీడియో)

by Prasanna |   ( Updated:2025-02-03 03:39:44.0  )
Thandel :  తండేల్ జాతర  లో మాస్ స్టెప్పులేసిన సాయి పల్లవి, నాగ చైతన్య ( వీడియో)
X

దిశ, వెబ్ డెస్క్ : లవ్ స్టోరీ వంటి సూపర్ హిట్ తర్వాత అక్కినేని నాగ చైతన్య ( Naga Chaitanya ) , సాయి పల్లవి ( Sai Pallavi ) కలిసి నటిస్తోన్న మూవీ తండేల్ ( Thandel ). " కార్తికేయ 2 "తో పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు పొందిన డైరెక్టర్ చందూ మొండేటి ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ ఈ మూవీని నిర్మించారు. ఇప్పటికే అన్ని అన్ని పనులు పూర్తి చేసుకున్న " తండేల్ " మూవీ వరల్డ్ వైడ్ గా ఫిబ్రవరి 07న విడుదల కానుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్లలో భాగంగా ఆదివారం హైదరాబాద్‌ లో ‘తండేల్‌ జాతర’ పేరుతో ప్రీ రిలీజ్‌ ఫంక్షన్ ను నిర్వహించారు.

ఇక, ఈ ఈవెంట్ కు ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు, దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తండేల్ జాతర ఈవెంట్ బాగా జరిగింది. ఈ సందర్భంగా సాయి పల్లవి, నాగచైతన్య కలిసి " హైలెస్సో.. హైలస్సా, శివ శక్తి " పాటలకు స్టేజిపైనే మాస్ స్టెప్పులు వేసి అందర్ని అలరించారు. సినిమాల్లో తప్ప బయట ఎక్కడా డ్యాన్స్ వేయని నాగ చైతన్యను, అల్లు అరవింద్‌ స్టేజీ పైకి తీసుకొచ్చి మరీ డ్యాన్స్‌ చేయించారు. అంతకు ముందు ఇదే పాటకు అల్లు అరవింద్, యాంకర్ సుమ కలిసి డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం, దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, పాటలు ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా, సాంగ్స్ అయితే బాగా హిట్ అయ్యాయి. ఇక ప్రమోషన్లు కూడా గ్యాప్ లేకుండా నిర్వహిస్తోంది చిత్ర బృందం. ఇప్పటికే వైజాగ్, చెన్నై, ముంబైలో ట్రైలర్ రిలీజ్ ఈవెంట్స్ కు మంచి రెస్పాన్స్ రాగా .. ఆదివారం హైదరాబాద్ లో " తండేల్ జాతర " పేరుతో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ ఈవెంట్ కు వస్తారని చాలా మంది ఆశగా ఎదురు చూశారు. అయితే, అనారోగ్య సమస్యల కారణంగా ఈ ఫంక్షన్ కు రాలేకపోయాడని అల్లు అరవింద్ తెలిపారు.

Next Story

Most Viewed