Rashmika Mandanna: రిషబ్ శెట్టి, రష్మిక మధ్య గొడవలు.. ఒక్క ట్వీట్‌తో బయటపడ్డ అసలు నిజం!

by Hamsa |   ( Updated:2025-01-04 12:28:25.0  )
Rashmika Mandanna: రిషబ్ శెట్టి, రష్మిక మధ్య గొడవలు.. ఒక్క ట్వీట్‌తో బయటపడ్డ అసలు నిజం!
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న(Rashmika Mandanna) ‘కిరిక్ పార్టీ’(KirikParty) సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది. రిషబ్ శెట్టి(Rishab Shetty) దర్శకత్వం వహించిన ఈ మూవీలో రక్షిత్ శెట్టి(Rakshit Shetty) హీరోగా నటించాడు. అయితే ఈ సినిమా విడుదలై ప్రేక్షకులను అలరించింది. ఈ క్రమంలోనే రక్షిత్, రష్మిక ప్రేమలో పడి పెద్దలను ఒప్పించి మరీ నిశ్చితార్థం చేసుకున్నారు. కొద్ది రోజుల్లో పెళ్లి అనగా అనుకోని కారణాల వల్ల విడిపోవడంతో పెళ్లి కూడా క్యాన్సిల్ అయింది.

ఇక రష్మిక ‘ఛలో’ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోలతో నటించి స్టార్ హీరోయిన్‌గా రాణిస్తుంది. ఇదిలా ఉంటే.. కిరిక్ పార్టీ సినిమా విడుదలై ఎనిమిదేళ్లు పూర్తి కావొస్తుండటంతో రిషబ్ శెట్టి(Rishab Shetty) X ద్వారా ఓ పోస్ట్ పెట్టారు. ‘‘8 సంవత్సరాల క్రితం, హృదయాలను హత్తుకునే, లెక్కలేనన్ని జ్ఞాపకాలను సృష్టించే ప్రయాణం ప్రారంభమైంది. కిరిక్ పార్టీని చాలా ప్రత్యేకం చేసిన మీ ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రక్షిత్ శెట్టి ఈ మరపురాని ప్రయాణం’’ అని రాసుకొచ్చారు.

అంతేకాకుండా రష్మిక మందన్న లేని పోస్టర్‌ను షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుండగా.. వీరిద్దరి మధ్య ఏవో గొడవలు జరిగాయని అందుకే ఆ పోస్టర్ షేర్ చేశాడని పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. ఇక రక్షిత్ శెట్టి ‘‘8 సంవత్సరాల క్రితం నేటికి ‘కిరిక్ పార్టీ’ నా ప్రయాణంలో, నా జట్టులో ఒక మలుపుగా మారింది. ఈ చిత్రం ప్రేమకు మన హృదయాల్లో ఎప్పుడూ ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటుంది’’ అని రాసుకొచ్చాడు. ఇక రష్మిక మాత్రం ఈ సినిమా గురించి ఎక్కడా పోస్ట్ పెట్టకపోవడంతో రిషబ్‌తో గొడవలు నిజమేనని అంతా అనుకుంటున్నారు.

Advertisement

Next Story