Kangan Ranaut:అల్లు అర్జున్ అరెస్ట్ పై స్పందించిన ఫైర్ బ్రాండ్.. రెస్పాన్సిబుల్‌గా ఉండాలంటూ..

by Kavitha |
Kangan Ranaut:అల్లు అర్జున్ అరెస్ట్ పై స్పందించిన ఫైర్ బ్రాండ్.. రెస్పాన్సిబుల్‌గా ఉండాలంటూ..
X

దిశ, సినిమా: ‘పుష్ప-2’ సినిమా ప్రీమియర్ షో నిర్వహించడం వల్ల సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ చనిపోగా, తన కుమారుడు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఆ మహిళ మృతి చెందటంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను నిన్న పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక బన్నీ అరెస్టును ఖండిస్తూ బాలీవుడ్, టాలీవుడ్ స్టార్స్ సోషల్ మీడియా వేదికగా పలు పోస్టులు పెడుతున్నారు. ఇక ఇప్పటికే బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్, నేచురల్ స్టార్ నాని, బ్రహ్మాజీ, రష్మిక మందన్న, రామ్ గోపాల్ వర్మ ఇలా చాలామంది స్పందించారు. అలాగే రాజకీయ నాయకులు కూడా దీన్ని తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్, బీజేపీ ఎంపీ, ఫైర్ బ్రాండ్ అయినటువంటి కంగనా రనౌత్ మీడియాతో మాట్లాడుతూ స్పందించింది.

ఇందులో భాగంగా అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడం దురదృష్టకరమని అన్నారు. అలాగే తాను బన్నీకి బిగ్ సపోర్టర్ అని తెలిపింది. అయితే చట్టం దృష్టిలో అందరూ సమానమని, అలాగే హై ప్రొఫైల్ కలిగిన వ్యక్తులు ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. అలాగే సంధ్య థియేటర్‌లో జరిగిన ఇన్సిడెంట్ గురించి మాట్లాడుతూ.. థియేటర్లలో ధూమపాన ప్రకటన ప్రసారం చేయడంతో పాటు రద్దీ ప్రాంతాలలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పడం కూడా ముఖ్యమని ఎందుకంటే ప్రజల జీవితాలు కూడా చాలా విలువైనవని కంగనా పేర్కొంది. దీంతో ప్రతి ఒక్కరూ జవాబుదారితనం కలిగి ఉండాలని తెలిపింది. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Advertisement

Next Story

Most Viewed