Unstoppable with NBK S4: ‘చిట్టిబాబు వచ్చేస్తున్నడ్రోయ్.. సౌండ్ ఇండియా మొత్తం వినపడాలే’

by Hamsa |   ( Updated:2025-01-01 12:53:01.0  )
Unstoppable with NBK S4: ‘చిట్టిబాబు వచ్చేస్తున్నడ్రోయ్.. సౌండ్ ఇండియా మొత్తం వినపడాలే’
X

దిశ, సినిమా: నందమూరి బాలకృష్ణ(Balakrishna) వరుస సినిమాలతో పాటు హిట్స్ అందుకోవడంతో పాటు అన్‌స్టాబుల్ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ షో ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకోగా.. ఇటీవల నాలుగోది మొదలైంది. అన్‌స్టాపబుల్(Unstoppable) షోకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉందనడంలో అతిశయోక్తి లేదు. అయితే ఇటీవల జరిగిన ఎపిసోడ్‌లో వెంకటేష్(Venkatesh) వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ప్రేక్షకుల్లో నెక్ట్స్ ఎపిసోడ్‌కు ఎవరు వస్తారనే ఆసక్తి పెరిగింది. ఈ క్రమంలో.. తాజాగా, ఆహా సంస్థ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే సీజన్-4’(Unstoppable with NBK Season 4) నుంచి ఓ స్పెషల్ ఎపిసోడ్ రాబోతుంది.

ఈ సారి చిట్టిబాబు వస్తున్నాడు. సౌండ్ ఇండియా మొత్తం వినపడాలే’’ అని రాసుకొచ్చారు. అయితే ఈ ఎపిసోడ్ షూటింగ్ డిసెంబర్ 31న అన్నపూర్ణ స్టూడియోలో జరగనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆహా పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో మెగా ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు. కాగా, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘గేమ్ చేంజర్’(Game Changer). శంకర్ దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీలో కియారా అద్వాని(Kiara Advani) హీరోయిన్‌గా నటిస్తుంది. అయితే ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 10 విడుదల కాబోతుండటంతో మూవీ మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగానే రామ్ చరణ్ అన్‌స్టాపబుల్ షోకు రాబోతున్నాడు.

Advertisement

Next Story