అమితాబ్ బచ్చన్ షోలో పవన్ కళ్యాణ్ గురించి ప్రశ్న.. ఎన్ని లక్షలకు అడిగాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

by Kavitha |
అమితాబ్ బచ్చన్ షోలో పవన్ కళ్యాణ్ గురించి ప్రశ్న.. ఎన్ని లక్షలకు అడిగాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం ఆయన ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యత వహిస్తున్నాడు. అయితే అతనికి ఉన్న క్రేజ్ గురించి రెండు తెలుగు రాష్ట్రాల వారిని అడిగితే చెబుతారు. ఇక ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్న పవన్ కళ్యాణ్.. ఇప్పుడు బాలీవుడ్‌‌లోను ఆయన క్రేజ్ అమాంతం పెరిగి పోయింది. అదేలాగంటే..

తాజాగా అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ షోలో పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన ప్రశ్న వచ్చింది. అందులో భాగంగా 2024 ఎన్నికల్లో ఏపీలో ఓ నటుడు డిప్యూటీ సీఎం అయ్యారు.. అతను ఎవరు? అని ఆప్షన్స్ ఇచ్చారు. ఆ ఆప్షన్‌లో మొదటి పేరు పవన్ కళ్యాణ్ ఉండగా.. తర్వాత ఆప్షన్స్‌లో చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణల పేర్లు ఉన్నాయి. అవతలి వాళ్ళకి సమాధానం తెలియకపోవడంతో.. వాళ్లు ఆడియెన్స్ పోల్‌కు వెళ్లారు. ఆడియన్స్ అంతా కలిసి సరైన సమాధానం చెప్పారు. దీంతో ఆప్షన్ ఏ(A) పవన్ కళ్యాణ్‌ను సెలెక్ట్ చేసుకున్నారు. ఆ ప్రశ్న విలువ లక్షా అరవై వేలు(1,60,000). ఇక ఆ అమౌంట్ గెలిచిన తర్వాత అమితాబ్.. సదరు కంటెస్టెంట్లకు పవన్ కళ్యాణ్ గురించి ఇంట్రో ఇచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది, ఇది చూసిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ఆలస్యం ఎందుకు మీరు ఆ వీడియో పై ఓ లుక్ వేసేయండి.

(video link credits to Narendra G X account)

Advertisement

Next Story

Most Viewed