Return of the Dragon : దూసుకెళ్తున్న డ్రాగన్.. రోజు రోజుకి పెరుగుతున్న ప్రదీప్ రంగనాథన్ క్రేజ్ ..!

by srinivas |
Return of the Dragon : దూసుకెళ్తున్న డ్రాగన్.. రోజు రోజుకి పెరుగుతున్న ప్రదీప్ రంగనాథన్ క్రేజ్ ..!
X

దిశ, వెబ్ డెస్క్ : యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లవ్ టుడే మూవీ(Love Today)తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనా ఈ తమిళ హీరో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకెళ్తున్నాడు. లవ్ టుడే చిత్రం తమిళ్ , తెలుగులో ఎంత పెద్ద విజయం సాధించిందో మనందరికి తెలిసిందే. ఇక తాజాగా రిలీజ్ అయిన డ్రాగన్ చిత్రంతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. తెలుగు ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది. తమిళంలో అయితే బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ వసూలు చేస్తుంది.

కోలీవుడ్ వర్గాల అంచనా ప్రకారం, లవ్ టుడేని ( Love Today ) కూడా దాటే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. శనివారం ఒక్కరోజే తమిళనాడు అన్ని ప్రధాన సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ పడ్డాయి. ఆంధ్ర , తెలంగాణలో కూడా 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' మూవీ సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తుంది. అందరూ ప్రదీప్ ని జూనియర్ ధనుష్ అని పిలుస్తుంటారు.

ఇప్పటివరకు రెండు చిత్రాలను డైరెక్ట్ చేసిన ప్రదీప్, కోమలి ( comali ) అనే మూవీతో మంచి విజయాన్ని అందుకున్నాడు. తర్వాత , తానే హీరోగా నటించి, దర్శకత్వం వహించిన " లవ్ టుడే " బ్లాక్‌బస్టర్ విజయం సాధించింది. ఇప్పుడు, ఈ మూవీతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీని పట్టాలెక్కిస్తున్నాడు. ఈ మూవీలో ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి కథానాయికగా నటిస్తుంది. నయనతార భర్త విగ్నేష్ శివన్ డైరెక్షన్ వహిస్తున్నారు. ధనుష్ లాగానే, ప్రదీప్ రంగనాథన్ కూడా తనకంటూ ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంటాడు. రోజు రోజుకి యూత్ ఈ హీరోకి ఫాలోయింగ్ పెరుగుతోంది. ప్రస్తుతం, మంచి సినిమాలేవీ లేకపోవడంతో 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' మూవీ విజయానికి ఇది ప్లస్ అయ్యింది.

Next Story

Most Viewed