Pradeep Ranganathan: డ్రాగన్ సినిమా ఎలా ఉంటుందో చెప్పేసిన ప్రదీప్ రంగనాథన్.. హీరో కామెంట్స్ వైరల్

by sudharani |
Pradeep Ranganathan: డ్రాగన్ సినిమా ఎలా ఉంటుందో చెప్పేసిన ప్రదీప్ రంగనాథన్.. హీరో కామెంట్స్ వైరల్
X

దిశ, సినిమా: తమిళ్ నటుడు ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) త్వరలో ‘రిటర్న ఆఫ్ ది డ్రాగన్’ (Return of the Dragon) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. యంగ్ బ్యూటీస్ అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran), కయాదు లోహర్ (Kayadu Lohar) హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీకి ‘ఓ మై కడవులే’ ఫేమ్ అశ్వత్ మరి ముత్తు (Ashwatmari Muttu) దర్శకత్వం వహిస్తున్నారు. ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కల్పాతి ఎస్. అఘోరమ్, కల్పాతి ఎస్. గణేష్, కల్పాతి ఎస్. సురేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే ఇందులో నుంచి వచ్చిన ప్రతి అప్‌డేట్ ఆకట్టుకోగా.. తాజాగా వచ్చిన ట్రైలర్‌కు సోషల్ మీడియాలో విశేష స్పందన లభిస్తోంది. దీంతో భారీ అంచనాల మధ్య ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా ఫిబ్రవరి 21న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. రిలీజ్ సమయం దగ్గరలోనే ఉండటంతో.. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ (Pre release event)ను ఘనంగా నిర్వహించారు చిత్ర బృందం.

ఈ సందర్భంగా హీరో ప్రదీప్ రంగనాథన్ మాట్లాడుతూ.. ‘మనం నిత్యం ఏదో ఓక విషయం కోసం ప్రయత్నిస్తూనే ఉంటాం. అలా ప్రయత్నించే ప్రతి ఒక్కరి గుండెకు దగ్గరైన సినిమాగా మా డ్రాగన్ ఉంటోందని నేను నమ్ముతున్నాను. నన్ను ఆదరించే తెలుగు ప్రజలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు’ అంటూ వచ్చి రానీ తెలుగుతో మాట్లాడి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు ఈ యంగ్ హీరో. కాగా.. కామెడీ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాలో మిస్కిన్, కెఎస్ రవికుమార్, విజె సిద్ధూ, హర్షత్ ఖాన్, అవినాష్ పి వంటి ప్రముఖులు కీలక పాత్రలో నటిస్తున్నారు.

Next Story