Adipurush : ‘ఆదిపురుష్’ సినిమా కోసం భారీ రెమ్యూనరేషన్ తీసుకున్న ప్రభాస్.. ఎన్ని కోట్లంటే?

by Hamsa |   ( Updated:2023-12-13 15:14:04.0  )
Adipurush : ‘ఆదిపురుష్’ సినిమా కోసం భారీ రెమ్యూనరేషన్ తీసుకున్న ప్రభాస్.. ఎన్ని కోట్లంటే?
X

దిశ, వెబ్ డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం ‘ఆదిపురుష్’. ఈ సినిమాను డైరెక్టర్ ఓం రౌత్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. ‘ఆదిపురుష్’ టీజర్ వల్ల విపరీతమైన ట్రోల్స్ వచ్చినప్పటికీ ట్రైలర్ విడుదలో తర్వాత సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా ఎదురుచూశారు. అయితే జూన్ 16న గ్రాండ్‌గా విడుదలై మిక్స్‌డ్ రెస్పాన్స్‌ను దక్కించుకుంటోంది. ఇప్పటివరకు రామాయణం ఆధారంగా చాలా సినిమాలు వచ్చాయి. కానీ వాటితో పోలిస్తే ‘ఆదిపురుష్’ చాలా డిఫరెంట్‌గా రూపొందించారు.

ఏకంగా రూ. 500 కోట్ల బడ్జెట్ పెట్టి మరీ తీశారు. దీంతో సినిమాకే అన్ని కోట్లు పెట్టి తీస్తే అందులో నటించిన నటీనటుల రెమ్యూనరేషన్‌ ఎంతగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా, ప్రభాస్ పారితోషికానికి సంబంధించిన ఓ వార్త వైరల్‌గా మారింది. రాముడిగా నటించినందుకు డార్లింగ్ ప్రభాస్‌కి ఏకంగా రూ. 150 కోట్ల వరకు ఇచ్చారని టాక్. దీంతో ఇండియా మొత్తంలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న నటుడిగా డార్లింగ్ రికార్డ్ సృష్టించాడు. అయితే రావణుడిగా చేసి సైఫ్ అలీఖాన్‌కు రూ.12 కోట్ల వరకు అందిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే సీతగా నటించిన కృతి సనన్’కు 13 కోట్లు.. లక్ష్మణుడిగా నటించిన సన్ని సింగ్‌కు రూ. 1,5 కోట్లు ఇచ్చారని సమాచారం.

Advertisement

Next Story