- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Prabhas Heroine: సినిమాలకు దూరమైన ప్రభాస్ హీరోయిన్.. ఇలా తయారైంది అంటూ కామెంట్స్ చేస్తున్న నెటిజన్స్

దిశ, వెబ్ డెస్క్ : సినీ ఇండీస్ట్రీలో నటీ నటులు 5 నుంచి 10 ఏళ్ల వరకు నటించే అవకాశం ఉంటుంది. ఈ సమయంలోనే వచ్చిన ఛాన్స్ లను ఉపయోగించుకొని వారి లైఫ్ ని సెట్ చేసుకుంటారు. దీనిలో కొందరు మెరుపు తీగ లాగా అలా వచ్చి ఒక సూపర్ హిట్ కొట్టి, కొద్దిరోజుల్లోనే మళ్లీ ఇండస్ట్రీలో కనిపించకుండా మాయమవుతున్నారు.
అలా తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ దీక్షాసేత్ ( Deeksha సేథ్ ) కూడా ఒకరు. ఈమె పేరు వినగానే ప్రభాస్ సినిమాలో నటించింది కదా అంటూ గుర్తు చేసుకుంటారు. " వేదం " మూవీతో తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన ఈమె, మోడలింగ్ చేస్తున్న సమయంలోనే సినిమాలో అవకాశం వచ్చింది. దీంతో, ఆమె నటనతో అందర్నీ ఆకట్టుకుంది ఈ అమ్మడు. ఈ మూవీతో ఆమెకు మంచి గుర్తింపు రావడంతో దీక్షాసేథ్ వరస సినిమాల్లో అవకాశం వచ్చింది. తెలుగులో రవితేజ , గోపి చంద్, ప్రభాస్ తో నటించింది. మిరపకాయ్ మూవీ హిట్ అయిన " వాంటెడ్ " హిట్ కాకపోవడంతో సినిమా అవకాశాలు తగ్గుతూ వచ్చాయి.
ఆ తర్వాత బాలీవుడ్ లో ఒక సినిమా చేసింది కానీ, అది కూడా ఫ్లాప్ అవ్వడంతో ఇండస్ట్రీకి దూరం అయిపోయింది. దాదాపుగా ఈ ముద్దుగుమ్మను అందరూ మరిచిపోయారూ అనుకున్న సమయంలోనే ఈమె బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న పాత ఫోటోలను సోషల్ మీడియా షేర్ చేస్తూ ఈమె అసలు దీక్షాసేతేనా .. ఇలా తయారైంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.