- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ప్లాస్టిక్ సర్జరీపై ప్రభాస్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్.. నా బాడీ పార్ట్స్ నా ఇష్టం అంటూ..

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంలో ఇండస్ట్రీలో రాణించాలంటే అందం చాలా ముఖ్యం. దానికోసం నటీనటులు వివిధ రకాల ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని తమ అందాన్ని పెంచుకుంటారు. అయితే దీని గురించి చాలామంది నిర్భయంగా బయట చెప్తే మరికొందరు మాత్రం అలాంటిది ఏమీ లేదని మాట దాటేస్తుంటారు. కానీ ఈ భామ మాత్రం అవును సర్జరీ చేయించుకున్నాను. చాన్స్ వచ్చినప్పుడు యూస్ చేసుకున్నాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు.. ఏంటి విశేషాలు అనేది ఇప్పుడు చూద్దాం..
టాలీవుడ్ హీరోయిన్ శృతి హాసన్(Shruti Haasan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ బ్యూటీ స్టార్ హీరో కమల్ హాసన్(Kamal Haasan) కూతురిగా ఇండస్ట్రీకి పరిచయం అయింది. అలా హిందీ, తమిళ భాషల్లో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇక తెలుగులో మహేష్ బాబు(Mahesh Babu), అల్లు అర్జున్(allu Arjun), రామ్ చరణ్(Ram Charan), ప్రభాస్(Prabhas), పవన్ కళ్యాణ్(Pawan Kalyan), చిరంజీవి(Chiranjeevi), బాలకృష్ణ(Balakrishna) వంటి స్టార్ హీరోలతో నటించి స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. భాషతో సంబంధం లేకుండా సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.
ప్రస్తుతం ఈ అమ్మడు రజనీకాంత్(Rajinikanth) ‘కూలీ’(Coolie) మూవీలో కీలక పాత్రలో నటిస్తుంది. అలాగే విజయ్(Vijay) చివరి సినిమా ‘జన నాయగన్’(Jana Nayagan)లోనూ నటించనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శృతి హాసన్ ప్లాస్టింగ్ సర్జరీ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. “నేను నా ముక్కును సరి చేసుకున్నాను. నా ముక్కు ఇంతకు ముందు భిన్నంగా ఉండేది. అంతకు ముందు నేను నా మొదటి సినిమా చేశాను. షూటింగ్ సమయంలో నా ముక్కుకు గాయమైంది.
దీంతో ట్రీట్మెంట్ చేయించుకున్నాను. దాన్నే అవకాశంగా తీసుకొని ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాను. చాన్స్ వచ్చినప్పుడు ఎందుకు ఉపయోగించుకోవద్దు అనుకున్నాను. దీని గురించి చెప్పడానికి ఎలాంటి మొహమాటం లేదు. ఇది నా శరీరం నా ఇష్టం. నా శరీరంలో మార్పులు చేసుకోవడం నా ఇష్టం. నేను అన్నీ సొంతంగానే నిర్ణయాలు తీసుకుంటాను” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.