Pooja Hegde: రాణి పింక్‌ డ్రెస్‌లో దర్శనమిచ్చిన గోపికమ్మ.. ఆకట్టుకుంటోన్న పిక్స్ వైరల్

by Anjali |   ( Updated:2025-03-15 18:09:02.0  )
Pooja Hegde: రాణి పింక్‌ డ్రెస్‌లో దర్శనమిచ్చిన గోపికమ్మ.. ఆకట్టుకుంటోన్న పిక్స్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: హీరోయిన్ పూజా హెగ్దే (Pooja Hegde) గురించి స్పెషల్‌గా అక్కర్లేదు. ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో వరుస అవకాశాలు దక్కించుకుని ఫుల్ పాపులర్ అయ్యింది. అందం, అభినయం, డ్యాన్స్‌తో తెలుగు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. టాలీవుడ్‌లో కొన్ని డేస్‌ పాటు ఈ హీరోయిన్ ఓ ఊపు ఊపిందనడంలో అతిశయోక్తిలేదు.

ఏకంగా టాలీవుడ్ అగ్ర కథానాయకులతో నటించి.. మెప్పించింది. టాలీవుడ్ ప్రముఖ సీనియర్ హీరో సూపర్‌స్టార్ మహేష్ బాబు (Superstar Mahesh Babu), గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Global star Ram Charan), పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Pan India Star Prabhas), జూనియర్ ఎన్టీఆర్ (Jr. NTR), ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Icon Star Allu Arjun) వంటి స్టార్ హీరోలతో నటించి.. తన క్యూట్‌నెస్‌తో కుర్రాళ్లను ఫిదా చేసింది ఈ బుట్టబొమ్మ.

ఈ బ్యూటీ ముగమూడి, ఒక లైలా కోసం (Oka laila kosaṁ), ముకుంద, మొహెంజో దారో, డీజే: దువ్వాడ జగన్నాథం (Duvvada Jagannatham), రంగస్థలం (Raṅgasthalam), సాక్ష్యం (Saksyam), అరవింద సమేత వీర రాఘవ, మహర్షి, గద్దలకొండ గణేష్ (Gaddalakonda Ganesh), హౌస్‌ఫుల్ 4, అల వైకుంఠపురములో (Ala Vaikunthapuram), మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ (Most Eligible Bachelor), రాధే శ్యామ్, ఆచార్య, F3: సరదా మరియు నిరాశ, మృగం, సిర్కస్, కిసీ కా భాయ్ కిసీ కి జాన్ (Kissi Ka Bhai Kissi Ki Jaan), దేవా (Deva) వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.

ఇకపోతే ఈ బ్యూటీ సినిమాల్లో తక్కువ అవకాశాలు సంపాదించుకున్నప్పటికీ... సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. ఏదో ఒక పోస్ట్ పెడుతూ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ బుట్టబొమ్మ ఇన్‌స్టాగ్రామ్ వేదికన ఓ పోస్ట్ పెట్టింది. అదిరిపోయే ఫొటో షూట్ చేసి.. తన అభిమానులతో పంచుకుంది. రాణి పింక్ కలర్ లెహంగా ధరించి స్టన్నింగ్ స్టిల్స్‌కు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ గోపికమ్మ లేటెస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

READ MORE ...

Mrunal Thakur: ఫారెవర్ అని క్యాప్షన్ జోడించి కిస్, హగ్గులతో ముంచెత్తుతోన్న టాలీవుడ్ బ్యూటీ



Next Story