- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Pooja Hegde: సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలో చాన్స్ అందుకున్న అల్లు హీరోయిన్!?

దిశ, సినిమా: ‘ఒక లైలా కోసం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన పూజా హెగ్డే (Pooja Hegde).. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. మొదటి మూవీతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. అల్లు అర్జున్ (Allu Arjun) ‘అలా వైకుంఠపురం’ చిత్రంతో టాలీవుడ్‌లో బుట్టబొమ్మగా పేరు తెచ్చుకుంది. అనంతరం వరుస అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోయింది. అయితే.. ఆ తర్వాత వచ్చిన వరుస సినిమాలు డిజాస్టర్‌గా మిగిలాయి.. దీంతో ఐరన్ లెగ్‌గా కూడా ముద్ర వేసుకుంది. దీంతో కొంత కాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన బుట్టబొమ్మ మళ్లీ ఫామ్ లోకి వచ్చి వరుస సినిమాలు చేస్తూ సందడి చేస్తుంది. ఈ క్రమంలోనే రీసెంట్‌గా ‘దేవా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలాగే.. ‘రెట్రో’, ‘జన నాయగన్’, దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan)తో ఒక మూవీ ఇలా మూడు, నాలుగు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ బ్యూటీ మరో స్టార్ ఆఫర్ అందుకున్నట్లు తెలుస్తోంది.
సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) ప్రస్తుతం ‘జైలర్-2’ (Jailer-2) తో బిజీగా ఉన్నారు. అలాగే.. లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో ‘కూలీ’ అనే చిత్రం కూడా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్న నాగార్జున, ఉపేంద్ర, సత్యరాజ్, చౌబిన్ సాహీర్, శృతి హాసన్ తదితరులకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ కూడా రిలీజ్ చేశారు చిత్ర బృందం. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం గోల్డ్ స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. అలాగే.. ఈ సినిమాలో ఓ ఐటెమ్ సాంగ్ ఉందని తెలుస్తుండగా.. ఈ స్పెషల్ సాంగ్ కోసం పూజా హెగ్డేను తీసుకున్నట్లు తమిళ చిత్ర సీమలో వార్తలు వస్తున్నాయి. అయితే.. వైరల్ అవుతున్న ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ సూపర్ స్టార్ సినిమాలో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్‌లో చేస్తుందా వావ్ అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు.