‘పినాక’ టైటిల్ టీజర్ అవుట్.. భయపెడుతున్న శాండల్‌వుడ్ గోల్డెన్ స్టార్ గణేష్

by Kavitha |
‘పినాక’ టైటిల్ టీజర్ అవుట్.. భయపెడుతున్న శాండల్‌వుడ్ గోల్డెన్ స్టార్ గణేష్
X

దిశ, సినిమా: శాండల్ వుడ్ గోల్డెన్ స్టార్ గణేష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పినాక’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై 49వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాతోనే ప్రముఖ కొరియో గ్రాఫర్ బి ధనంజయ డైరెక్టర్‌గా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. అయితే నిర్మాత టీజీ విశ్వప్రసాద్, క్రితి ప్రసాద్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. ఇక యూనిక్ స్టోరీతో రాబోతున్న ఈ మూవీ నుంచి తాజాగా మేకర్స్ టైటిల్ టీజర్, గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు.

ఇక టీజర్‌ను పరిశీలించినట్లయితే.. క్షుద్రపూజలు చేస్తున్న ప్లేస్‌లో హీరో ఎంట్రీ ఇచ్చి భయపెట్టించేశాడు. అలాగే గంభీర మైన లుక్‌లో చాలా పుర్రెలను ఒక సింహాసనం టైప్‌లా చేసుకుని వాటి మధ్యలో కూర్చోని ఎవేవో మంత్రాలు జపించాడు. అంతేకాకుండా ఓ పామును బయటకు తీయగా.. అది అమాంతం త్రిశూలం వైపు తన విషాన్ని చిమ్ముతుంది. దీంతో ఈ త్రిశూలం మొత్తం మంట అంటుకుని కాలిపోతుంటది. ఇక దీన్నే పట్టుకుని హీరో మళ్లీ ఆ పుర్రెల సింహాసనం పైన కూర్చుంటాడు. ప్రస్తుతం ఈ టీజర్ సినిమాపై మరింత హైప్ పెంచేస్తుంది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు.. టీజరే ఈ రేంజ్‌లో ఉంటే మరి సినిమా ఇంకే రేంజ్‌లో ఉంటుందో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed