AP High Court:రామ్ చరణ్, బాలయ్య సినిమాలపై హైకోర్టులో పిల్

by Jakkula Mamatha |
AP High Court:రామ్ చరణ్, బాలయ్య సినిమాలపై హైకోర్టులో పిల్
X

దిశ,వెబ్‌డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) నటించిన తాజా చిత్రం గేమ్ ఛేంజర్. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటిస్తున్న తాజా చిత్రం ‘డాకు మహారాజ్’. ఈ చిత్రాన్ని బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన టైటిల్ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

అంతేకాదు ఫస్ట్ లిరికల్ సాంగ్ ను కూడా మేకర్స్ విడుదల చేశారు. అయితే ఈ మూవీ కూడా సంక్రాంతికి కానుకగా జనవరి 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. సంక్రాంతికి రానున్న రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ నందమూరి బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ సినిమాల టికెట్ ధరల్ని పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం(AP Government) ఇటీవల అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ హైకోర్టులో పిల్ దాఖలైంది. అది నిబంధనలకు విరుద్ధమని పిటిషనర్ అందులో పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు రద్దు చేయాలని కోరారు. ప్రతివాదులుగా ఆ రెండు సినిమాల మూవీ టీమ్‌లను చేర్చారు.

Advertisement

Next Story