HHVM: పవర్ స్టార్ ఫ్యాన్స్ అలర్ట్.. ‘వీరమల్లు’ వచ్చేస్తుండు!

by Gantepaka Srikanth |   ( Updated:2024-11-25 12:10:53.0  )
HHVM: పవర్ స్టార్ ఫ్యాన్స్ అలర్ట్.. ‘వీరమల్లు’ వచ్చేస్తుండు!
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్(Power Star) పవన్ కల్యాణ్(Pawan Kalyan) అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్‌లో హరిహర వీరమల్లు(Harihara Veeramallu) ఒకటి. గత ఐదేళ్లుగా ఈ సినిమా విడుదల వాయిదాలు పడుతూ వస్తోంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు రావడంతో మేకర్లు రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది మార్చి 28వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నారు. అంతేకాదు.. హరిహర వీరమల్లు అనే ట్విట్టర్ ఖాతాలోనూ రిలీజ్ డేట్‌ను పేర్కొన్నారు.

దీంతో ఎన్నాళ్లకు శుభవార్త చెప్పావయ్యా అంటూ నిర్మాతకు కృతజ్ఞతలు చెబుతున్నారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నారు. బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్ విలన్‌గా చేస్తున్నారు. యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా చేస్తోంది. దీంతో సుజిత్ దర్శకత్వంలో ఓజీ(ఓజాస్ గంభీరా), హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed