Orange Movie: ‘ఆరెంజ్’ రీ రిలీజ్ ట్రైలర్ అవుట్.. ఎమోషనల్ ఎలిమెంట్స్‌తో రామ్ అదరగొట్టాడుగా

by Kavitha |
Orange Movie: ‘ఆరెంజ్’ రీ రిలీజ్ ట్రైలర్ అవుట్.. ఎమోషనల్ ఎలిమెంట్స్‌తో రామ్ అదరగొట్టాడుగా
X

దిశ, సినిమా: ‘మగధీర’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటించిన చిత్రం ‘ఆరెంజ్’ (Orange). అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నాగబాబు (Nagababu) భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రానికి బొమ్మరిల్లు భాస్కర్ (Bommarillu Bhaskar) దర్శకత్వం వహించారు. రిలీజ్‌కు ముందే హారీష్ జయరాజ్ (Harris Jayaraj) అందించిన పాటలు ‘ఆరెంజ్’ సినిమాపై ఎక్కడలేని ఎక్స్‌పెక్టేషన్స్ పెంచాయి. పైగా ‘మగధీర’ తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తుండటంతో విపరీతమైన హైప్ ఏర్పడింది. కానీ ఫ్యాన్స్, ఆడియన్స్ ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ మ్యాచ్ చేయడంలో ఆరెంజ్ విఫలమైంది.

ఫలితంగా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా మిగిలిపోయింది. కానీ ఈ సినిమాకు ఇప్పటికీ కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు అని అనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ప్రస్తుతం పాత సినిమాల రీరిలీజ్ ట్రెండ్‌ నడుస్తుండగా.. ‘ఆరెంజ్’ (Orange Rerelease)కూడా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా మూవీ లవర్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. ఈ మేరకు ఈ మూవీ నుంచి కొత్తగా రీ రిలీజ్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.

ఇక ట్రైలర్‌ను గమనించిట్లయితే.. రామ్ చరణ్ నేను వరల్డ్‌లోనే గ్రెటెస్ట్ లవర్ అని చెప్తూ ట్రైలర్ స్టార్ట్ అవుతుంది.. అప్పుడు ప్రకాష్ రాజ్ ఏది చెప్పు నీ లవ్ స్టోరీ అని అడుగగా.. దానికి రామ్ స్కూల్ ఏజ్ నుంచి ఇప్పటి వరకు నావి 9 లవ్ స్టోరీలు ఉన్నాయని చెప్పి ఒక్కోక్కటి రివీల్ చేస్తుంటాడు. అప్పుడు ప్రకాష్ రాజ్ అవన్నీ వద్దు కానీ మధు (జెనీలియా)తో లవ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అది చెప్పమంటాడు. అలా ఆమెతో జరిగిన హ్యాపీ, శాడ్ మూమెంట్స్ అన్ని చెప్పి లాస్ట్‌లో ఎమోషనల్ ఎలిమెంట్స్‌తో ట్రైలర్ ఆసక్తి పెంచేలా ఉంది.

అంతేకాకుండా వరల్డ్ గ్రేటెస్ట్ లవర్ రామ్ క్యారెక్టర్ చేసిన రామ్ చరణ్.. ‘లవ్ కొంతకాలమే బాగుంటుంది.. జీవితాంతం ప్రేమించడం కుదరదు’ అని సినిమాలో ప్రేమ గురించి ఇచ్చే డెఫినేషన్‌.. నిజానికి 2010లో ఆడియన్స్‌ను కన్‌ఫ్యూజ్ చేసింది. కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయొచ్చు అంటూ నెటిజన్లు ఈ వీడియో కింద కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ ట్రైలర్‌ను చూసేయండి.

Next Story