అలనాటి స్టార్ హీరోయిన్ రీ ఎంట్రీ ఫిక్స్.. ఫుల్ హ్యాపీలో ఫ్యాన్స్..

by Kavitha |
అలనాటి స్టార్ హీరోయిన్ రీ ఎంట్రీ ఫిక్స్.. ఫుల్ హ్యాపీలో ఫ్యాన్స్..
X

దిశ, వెబ్‌డెస్క్: అలనాటి స్టార్ హీరోయిన్ రంభ(Rabha) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 90వ దశకంలో ఈ బ్యూటీ ఎక్కువగా పేరు మార్మోగిపోయింది. దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి మంచి ఫేమ్ తెచ్చుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, హిందీ, కన్నడ ఇలా అన్ని భాషల్లో నటించి రంభ తన కంటూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకుంది. అలా నటిగా రంభ కెరీర్‌లో మరుపురాని క్లాసిక్ చిత్రాలెన్నో ఉన్నాయి.

అయితే గత కొన్నేళ్లుగా రంభ ఈ సినీ పరిశ్రమకు, నటనకు దూరంగా ఉంటూ వచ్చారు. ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. గ్లామర్, నటన, గ్రేస్ ఫుల్ స్టెప్పులకు అప్పటి ఆడియన్స్ ఫిదా చేసిన రంభ మళ్లీ ఇప్పుడు అలరించడానికి మన ముందుకు రాబోతుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రంభ తన రీ ఎంట్రీ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘నా ఫస్ట్ ఛాయిస్ ఎప్పుడూ సినిమానే.

ఇక ఇప్పుడు ఎలాంటి ఛాలెంజింగ్ రోల్స్ చేసేందుకు అయినా నేను సంసిద్ధంగా ఉన్నాను. ఇదే సరైన సమయం అని నేను భావిస్తున్నాను. కొత్త పాత్రలను ఎంచుకుని, మళ్లీ ఆడియెన్స్‌ను ఆకట్టుకునే సినిమాలతో రీ ఎంట్రీ ఇవ్వాలని ఎదురుచూస్తున్నాను’ అని అన్నారు. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక అభిమానులు, ప్రేక్షకులు ఆమె రీ ఎంట్రీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి రంభ రీ ఎంట్రీ ఎలా ఉంటుందో.. ఎలాంటి చిత్రాలతో ఆడియన్స్ ముందుకు వస్తుందో అని అంతా ఎదురుచూస్తున్నారు.

Next Story