- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఎన్టీఆర్ వీడియో.. దారుణమైన ట్రోల్ చేస్తున్న నెటిజన్లు!

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్(NTR) గత ఏడాది ‘దేవర’సినిమాతో వచ్చి ఘన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. కొరటాల శివ(Koratala Siva) దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) ఎన్టీఆర్ సరసన హీరోయిన్‌గా నటించింది. అయితే ఈ మూవీ థియేటర్స్‌లో హిట్ సాధించడంతో పాటు భారీ కలెక్షన్లు రాబట్టి బాక్సాఫీసును షేక్ చేసింది. అలాగే జాన్వీ, ఎన్టీఆర్ కెమిస్ట్రీకి సినీ ప్రేక్షకులంతా మంత్రముగ్దులయ్యారనడంలో అతిశయోక్తి లేదు. అదే ఫామ్‌తో ఆయన ఇప్పుడు వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర-2, వార్-2 వంటి భారీ ప్రాజెక్ట్స్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అంతేకాకుండా స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో కూడా ఓ పాన్ ఇండియా మూవీ చేయనున్నాడు.
ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ అయిన ఈ సినిమా నుంచి అప్డేట్స్ విడుదల కానప్పటికీ నిత్యం ఏదో ఒక వార్త మాత్రం నెట్టింట వైరల్ అవుతూనే ఉంటుంది. అయితే ఎన్టీఆర్ ఓ వైపు వరుస సినిమాలు చేస్తూనే మరోవైపు తీరిక లేకుండా యాడ్స్‌లోనూ నటిస్తూ చేతినిండా డబ్బు సంపాదిస్తున్నారు. తాజాగా, ఆయన చేసి ఓ యాడ్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్‌గా మారింది. అయితే ఇందులో వార్ లుక్ రివీల్ కాకుండా కాస్త జాగ్రత్త పడ్డారు. హెయిర్ స్టైల్ మార్చి కొత్తగా ట్రై చేశారు. స్లిమ్ లుక్‌లో కనిపించిన ఆయన వెరైటీ హెయిర్ స్టైల్‌తో ఉన్నారు. దీంతో ఈ వీడియోను చూసిన కొందరు ఏమైంది ఇలా మారిపోయాడని అంటుంటే.. యాంటీ ఫ్యాన్స్ మాత్రం దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అదేం లుక్ చాలా చండాలంగా ఉందని అంటున్నారు.