Chhaava: బ్లాక్ బస్టర్ సినిమా ‘ఛావా’ కోసం రంగంలోకి దిగబోతున్న ఎన్టీఆర్?

by Prasanna |
Chhaava: బ్లాక్ బస్టర్ సినిమా ‘ఛావా’ కోసం రంగంలోకి దిగబోతున్న ఎన్టీఆర్?
X

దిశ, వెబ్ డెస్క్ : బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ ( Vicky Kaushal ) , హీరోయిన్ రష్మిక మందన్న ( Rashmika Mandanna ) కాంబోలో మన ముందుకొచ్చిన మూవీ " ఛావా " ( Chhaava ) . ఫిబ్రవరి 14న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం రూ.300కోట్ల కలెక్షన్లతో దూసుకువెళ్తుంది. మరో రెండు రోజుల్లో రూ. 500కోట్లు దాటేసే అవకాశాలున్నాయని అంటున్నారు. ఈ మూవీని టాలీవుడ్ లో కూడా ప్రమోషన్లు చేసినా ఇంతవరకు ఇక్కడ విడుదల చెయ్యలేదు. అయితే, ఇప్పుడు తెలుగులో రిలీజ్ చెయ్యాలని మూవీ టీమ్ ప్లాన్ చేస్తోందని, దానిలో ఎన్టీఆర్ కూడా జాయిన్ అవ్వబోతున్నారని తెలుస్తోంది.

ఛత్రపతి శివాజీ కొడుకు శంభాజీ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మన తెలుగు వాళ్ళు కూడా చూస్తున్నారు. బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ అయిన ఈ చిత్రం తెలుగులో కూడా ఆడియెన్స్ నుంచి మంచి స్పందన రావడంతో తెలుగులో డబ్ చేసి విడుదల చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే, తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

" ఛావా " ( Chhaava ) చిత్రంలో విక్కీ కౌశల్ కి ఎన్టీఆర్ ( jr ntr) డబ్బింగ్ చెప్పబోతున్నాడంటూ ఓ రూమర్ వినిపిస్తోంది. తారక్ పవర్ ఫుల్ డైలాగ్స్ ఎలా చెబుతాడో మనందరికీ తెలిసిందే. అందువలన ఎన్టీఆర్ తో డబ్ చేయించాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. " వార్ 2 " మూవీతో డైరెక్ట్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు ఎన్టీఆర్. ఇప్పుడు విక్కీ కోసం ఎన్టీఆర్ వాయిస్ ఇస్తే తన తర్వాత సినిమాకి కూడా హెల్ప్ అవుతుంది. " ఛావా " చిత్రానికి ఎన్టీఆర్ నిజంగానే డబ్బింగ్ చెబుతున్నారా ? అధికారికంగా ఇంకా ప్రకటించలేదు కానీ, ఒకవేళ ఇదే నిజమైతే తెలుగులో ఫ్రీగానే ప్రమోట్ అవుతుంది. అలాగే, ఎన్టీఆర్ అభిమానులు కూడా సినిమాకు వెళ్తారు.

Next Story

Most Viewed