Akshay Kumar: అవకాశం వస్తే ఆ ఇండస్ట్రీని ఒకేతాటిపైకి తీసుకొస్తా.. స్టార్ హీరో షాకింగ్ కామెంట్స్

by sudharani |
Akshay Kumar: అవకాశం వస్తే ఆ ఇండస్ట్రీని ఒకేతాటిపైకి తీసుకొస్తా.. స్టార్ హీరో షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar), వీర్ పహారియా (Veer Paharia) ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ ‘స్పై ఫోర్స్’ (Spy Force). భారీ అంచనాల మధ్య ఈ చిత్రం జనవరి 24న థియేటర్స్‌ (Theaters)లో విడుదలై పాజిటివ్ టాక్‌ (Positive talk)ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అక్షయ్ కుమార్ బాలీవుడ్ (Bollywood) ఇండస్ట్రీపై షాకింగ్ కామెంట్స్ చేశాడు.

‘దక్షిణాదిలో ఏదైనా సినిమా రిలీజైతే నటీనటులంతా ఒకేతాటిపైకి వచ్చి ఆ చిత్రాన్ని సపోర్ట్ చేస్తూ ప్రమోట్ చేస్తారు. నిజంగా అది మెచ్చుకోవాల్సిన విషయం. కానీ బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆ ఐక్యతే ఉండదు. ఇండస్ట్రీలో ఐక్యత ఉండాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను. నాకు ఇండస్ట్రీకి సంబంధించిన ఏదైనా అవకాశం వస్తే.. పరిశ్రమను మరింత ఐక్యంగా ఉండేలా చేస్తాను. ఒకరి సినిమాకు మరొకరు సపోర్ట్ చేయాలి. ప్రతీ విజయాన్ని అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకోవాలి’ అంటూ చెప్పుకొచ్చాడు. కాగా.. సందీప్ కేవ్లానీ, అభిషేక్ అనిల్ కపూర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘స్పై ఫోర్స్’ చిత్రంలో సారా అలీఖాన్, సిమ్రత్ కౌర్, శరద్ ఖేల్కర్, మనీష్ చౌదరి కీలక పాత్రలో కనిపించారు. దీనిని దినేష్ విజాన్, జ్యోతి దేశ్‌పాండే, అమర్ కౌశిక్ నిర్మించారు.

Next Story