Nayanthara: మళ్లీ చిక్కుల్లో నయనతార.. క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్!

by Hamsa |
Nayanthara: మళ్లీ చిక్కుల్లో నయనతార.. క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్!
X

దిశ, సినిమా: లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanthara) 2023లో షారుఖ్ ఖాన్ ‘జవాన్’ చిత్రంలో నటించి హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఇక గత ఏడాది ఆమె జీవిత కథ ఆధారంగా ‘నయనతార: బియాండ్ ది ఫెయిర్‌టేల్’(Nayanthara: Beyond the Fairytale) పేరుతో డాక్యుమెంటరీ వచ్చిన విషయం తెలిసిందే. దీని ఓటీటీ హక్కలును నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోగా డిసెంబర్‌లో స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చింది. ఇక అప్పటి నుంచి నయనతార పలు వివాదాలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

ఇందులో ‘నానుమ్ రౌడీ’ (నేను రౌడీనే) సినిమా క్లిప్స్ యాడ్ చేసిందని నిర్మాత ధనుష్(Dhanush) రూ. 10 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని నోటీసులు పంపించాడు. దీంతో అతడిపై ఆమె ఇండైరెక్ట్‌గా పోస్టులు పెట్టింది. ఇక వీరిద్దరి వివాదం తమిళ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. దీంతో కొంతమంది నయన్, విఘ్నేష్‌లపై విమర్శలు చేశారు. ఇదిలా ఉంటే.. తాజాగా, మరోసారి నయనతార చిక్కుల్లో పడింది. దీంతో నెటిజన్లు క్షమాపణలు చెప్పాలని నెట్టింట డిమాండ్ చేస్తున్నారు.

అసలేం జరిగిందంటే.. నయనతార ఫేమీ 9 పేరుతో ప్రారంభించిన వ్యాపార సంస్థకు ఇన్‌ఫ్లుయెన్సర్ల(Influencers)ను ఆహ్మానించి ఓ ఈవెంట్ నిర్వహించారు. అయితే ఈ ఈవెంట్‌కు ఆమె ఉదయం 9 గంటలకు రావాల్సి ఉండగా.. 3గంటలకు వచ్చింది. ఏకంగా ఆరు గంటలు లేట్‌గా రావడంతో కార్యక్రమం సాయంత్రం 6 గంటలకు ముగిసింది. దీంతో ఈవెంట్‌కు వచ్చిన ఇన్‌ఫ్లుయెన్సర్లు బుక్ చేసుకున్న బస్సులు, రైళ్లు మిస్ అయ్యాయని సమాచారం. అయినప్పటికీ నయనతార క్షమాపణలు చెప్పకుండా ఈ ఈవెంట్‌కు సంబంధించిన ఫొటోలు నెట్టింట షేర్ చేసింది. అంతేకాకుండా ‘‘ఈ ప్రేమ చాలు. మా ఫేమి 9 కుటుంబం పెద్దదవుతుంది. మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’’ అనే క్యాప్షన్ జత చేయడంతో విమర్శలు చేస్తున్నారు. ఇబ్బంది పడిన వారికి క్షమాపణలు చెప్పాలంటూ కామెంట్లు పెట్టడంతో పాటు పలు విమర్శలు చేస్తున్నారు.

Next Story

Most Viewed