హాలీవుడ్‌ భామలకు గట్టి పోటీ ఇవ్వబోతున్న నేషనల్ క్రష్.. ఏ హీరోతో జతకట్టనుందంటే?

by sudharani |   ( Updated:2025-01-21 14:25:29.0  )
హాలీవుడ్‌ భామలకు గట్టి పోటీ ఇవ్వబోతున్న నేషనల్ క్రష్.. ఏ హీరోతో జతకట్టనుందంటే?
X

దిశ, సినిమా: బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ త్రిప్తి దిమ్రీ(Tripti Dimri) ‘యానిమల్’(Animal) సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. అంతే కాకుండా తన అందంతో యూత్‌ని సైతం ఆకట్టుకున్న ఈ అమ్మడు నేషనల్ క్రష్‌గా మారిపోయింది. దీంతో ప్రజెంట్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది. ఇటీవల ‘బ్యాడ్ న్యూజ్’ మూవీ(Bad Newz movie)తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్‌లో సినిమాలు చేస్తున్న త్రిప్తి ఇప్పుడు తన ఫోకస్ హాలీవుడ్‌(Hollywood)పై పెట్టినట్లు తెలుస్తోంది.

ఈ మేరకు ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్(Fast and Furious) వెబ్ సిరీస్ నటుడు టైరీస్ గిబ్సన్‌(Tyrese Gibson)తో జోడీ కట్టినట్లు సమాచారం. ప్రజెంట్ ఈ సిరీస్ చిత్రీకరణ దశలో ఉండగా.. సెట్స్ నుంచి కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక ఈ సిరీస్‌లో త్రిప్తి దిమ్రీతో పాటు హ్యారీ గుడ్విన్స్(Harry Goodwins) కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే.. దీనిపై ఎలాంటి అఫీషియల్ అప్‌డేట్ రాలేదు. అయినప్పటికీ.. టాలీవుడ్ కుర్రాళ్లను మంత్ర ముగ్దులను చేసుకున్న ఈ బాలీవుడ్ బ్యూటీ ఇప్పుడు హాలీవుడ్‌లో ఎలాంటి మాయ చేస్తోందో చూడాలి అంటూ చర్చించుకుంటున్నారు నెటిజన్లు.

Next Story