పద్మభూషణ్‌ అవార్డుపై నందమూరి బాలకృష్ణ ఫస్ట్ రియాక్షన్

by Gantepaka Srikanth |
పద్మభూషణ్‌ అవార్డుపై నందమూరి బాలకృష్ణ ఫస్ట్ రియాక్షన్
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రం పద్మభూషణ్‌ అవార్డు(Padma Bhushan award) ప్రకటించడంపై నటుడు నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) స్పందించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి(Central Govt) కృతజ్ఞతలు చెప్పారు. తనకు శుభాకాంక్షలు తెలిపిన అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. తనతో పాటు పద్మ అవార్డులు తీసుకున్నవారికి అభినందనలు చెప్పారు. కాగా, నందమూరి బాలకృష్ణతో పాటు తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం ఏడుగురు పద్మ అవార్డులకు ఎంపికయ్యారు. వైద్యరంగంలో విశేష సేవలు అందించిన డాక్టర్‌ డి.నాగేశ్వరరెడ్డికి పద్మవిభూషణ్, సినిమా రంగంలో తనదైన ముద్ర వేసిన నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్, ప్రజావ్యవహారాల విభాగంలో మంద కృష్ణ మాదిగకు, కళలు, సాహిత్యం, విద్యా విభాగాల్లో కె.ఎల్‌.కృష్ణ, మాడుగుల నాగఫణిశర్మ, దివంగత మిర్యాల అప్పారావు, రాఘవేంద్రాచార్య పంచముఖిలకు పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి.

Next Story

Most Viewed