NAGA CHAITANYA: శోభితతో సినిమా.. చైతన్య రియాక్షన్ ఇదే

by Kavitha |   ( Updated:2024-08-28 14:44:49.0  )
NAGA CHAITANYA: శోభితతో సినిమా.. చైతన్య రియాక్షన్ ఇదే
X

దిశ, వెబ్‌డెస్క్: సమంతతో విడాకుల తర్వాత నాగచైతన్య శోభితతో డేటింగ్ చేస్తున్నాడనే పుకార్లు షికార్లు చేశాయి. వాటిని నిజం చేస్తూ నాగ చైతన్య రీసెంట్‌గా స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళతో ఎంగేజ్‌మెంట్ చేసుకొని షాక్ ఇచ్చాడు. ఇక అప్పటి నుంచి వీరు సోషల్ మీడియాలో ఫుల్ హాట్ టాపిక్‌గా అయ్యారు.

ఇదిలా ఉంటే తాజాగా నాగ చైతన్య హైదరాబాదులో హిమాయత్ నగర్‌లో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్‌కు వచ్చారు. అక్కడ ఆయనను మీడియా శోభితను మిమ్మల్ని ఒకే తెర మీద చూడాలనుకుంటునన్నాము. అలా చూసే ఛాన్స్ ఉందా అని యాంకర్ అడుగగా.. వెంటనే చైతన్య స్పందిస్తూ.. సరైన స్క్రిప్ట్ దొరికితే శోభితతో కలిసి సినిమా చేస్తానని చెప్పారు. ప్రస్తుతం అయితే అలాంటి ప్లాన్స్ ఏమీ లేవన్నారు. కాగా ప్రస్తుతం నాగచైతన్య ‘తండేల్’ మూవీతో బిజీ బిజీగా ఉన్నాడు. ఈ మూవీ ఈ ఇయర్ ఎండింగ్‌లో రిలీజ్ కానుంది.

Advertisement

Next Story

Most Viewed