Mohanlal: కేరళలో ‘1000 కోట్లు’.. కొత్త సినిమాపై క్రేజీ అప్‌డేట్

by sudharani |   ( Updated:2024-11-30 16:26:01.0  )
Mohanlal: కేరళలో ‘1000 కోట్లు’.. కొత్త సినిమాపై క్రేజీ అప్‌డేట్
X

దిశ, సినిమా: స్టార్ మోహన్ లాల్ (Mohan Lal) త్వరలో ‘లూసిఫర్-2’తో బిజీగా ఉన్నాడు. ప్రజెంట్ షూటింగ్ శరవేగంగా జరుగుతోన్న ఈ చిత్రం వచ్చ ఏడాది మార్చి (March)లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా మోహన్ లాల్‌కు సంబంధించిన మరో కొత్త సినిమా అనౌన్స్‌మెంట్ (Announcement) వచ్చింది. మోహన్ లాల్ హీరోగా శ్రీకర్ మూవీ మేకర్స్ (Shrikar Movie Makers ) పతాకంపై కాసుల రామకృష్ణ (శ్రీధర్), శ్రీకరగుప్త, సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘1000 కోట్లు’. గతంలో ‘100 కోట్లు’ వంటి హిట్ చిత్రాన్ని నిర్మించిన కాసుల రామకృష్ణ ప్రస్తుతం ‘1000 కోట్లు’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ప్రజెంట్ ఈ మూవీకి సంబంధించిన డబ్బింగ్ కేరళ (Kerala)లో జరుగుతోంది. ఈ సందర్భంగా నిర్మాత కాసుల రామకృష్ణ (Kasula Ramakrishna) మాట్లాడుతూ.. ‘మలయాళంలో సూపర్ హిట్ అయిన చిత్రాన్ని తెలుగులో 1000 కోట్లు పేరుతో విడుదల చేయుటకు సన్నాహాలు చేస్తున్నాము. మోహన్ లాల్ సరసన కావ్య మాధవన్ (Kavya Madhavan) హీరోయిన్‌గా నటిస్తుంది. మరో విశేషమేమిటంటే ప్రముఖ సీనియర్ ఆర్టిస్ట్ నాగ మహేష్ (Naga Mahesh) మోహన్ లాల్ (Mohan Lal)కు వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. అన్ని కార్యక్రమాలు ముగించుకుని త్వరలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం’ అని తెలిపారు.

Read More...

Rajendra Prasad: ‘అవకాశాల్లేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’.. టాలీవుడ్ ప్రముఖ సీనియర్ నటుడు సంచలన కామెంట్స్


Advertisement

Next Story