రామ్ చరణ్ కొడుకుని కనాలంటూ మెగాస్టార్ కామెంట్స్.. నెట్టింట విమర్శల జల్లు

by Kavitha |
రామ్ చరణ్ కొడుకుని కనాలంటూ మెగాస్టార్ కామెంట్స్.. నెట్టింట విమర్శల జల్లు
X

దిశ, సినిమా: ‘మళ్లీ రావా’(Malli Raava), ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’(Agent Sai Srinivasa Athreya), ‘మసూద’(Masooda) వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్(Swadharm Entertainments) నుంచి వస్తున్న నాలుగో సినిమా ‘బ్రహ్మా ఆనందం’(Brahma Anandam). ఈ మూవీలో పద్మశ్రీ అవార్డు గ్రహీత, హాస్య బ్రహ్మ బ్రహ్మానందం(Brahmanandam), అతని కుమారుడు రాజా గౌతమ్(Raja Gowtham) ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అలాగే ప్రియ వడ్లమాని(Priya Vadlamani), ఐశ్వర్య హోలక్కల్(aishwarya) కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

శ్రీమతి సావిత్రి(savitri), శ్రీ ఉమేష్ కుమార్(Umesh Kumar) సమర్పణలో రూపొందించిన ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ Rvs నిఖిల్ తెరకెక్కించారు. అయితే ఈ చిత్రం ఫిబ్రవరి 14న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడటంతో మూవీ టీమ్ బ్రహ్మా ఆనందం ప్రీ రిలీజ్(Pre Release) ఈవెంట్ నిర్వహించారు. దీనికి గెస్ట్‌గా మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) వచ్చారు. అయితే ఈ సినిమా తాత – మనవడు రిలేషన్ మీద కావడంతో యాంకర్ సుమ అక్కడున్న వారందరిని తాత రిలేషన్ గురించి సరదాగా ప్రశ్నలు అడిగింది.

ఈ క్రమంలో స్క్రీన్ పై చిరంజీవి తన మనవరాళ్లతో కలిసి దిగిన ఫోటో వేయడంతో చిరంజీవి మాట్లాడుతూ.. ఇంట్లో నా గ్రాండ్ డాటర్స్ అందరితో ఉంటే ఒక లేడీ హాస్టల్ లాగా ఉంటుంది. వాళ్లకు నేను ఒక వార్డెన్ లాగా అనిపిస్తాను అన్నారు. అలాగే ఈ సారైనా చరణ్‌ని మగపిల్లాడిని కనమని చెప్పినట్టు, లెగసి కంటిన్యూ అవ్వాలని కోరిక అని అన్నారు. మళ్ళీ ఇంకో అమ్మాయిని కంటాడేమో భయం అని అన్నారు.అయితే సుమ సరదాగా అడగడంతో చిరు కూడా నవ్వుతూనే ఈ కామెంట్స్ చేశారు.

ఇక దీన్ని అదునుగా తీసుకుని పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో చిరంజీవి చేసిన కామెంట్స్ పై విమర్శలు చేస్తున్నారు. ఆడవాళ్ళ గురించి తప్పుగా మాట్లాడారని, ఇంకా సమాజంలో ఆడపిల్లలు వద్దనేలా మాట్లాడారని, సమాజం ఎంత మారుతున్నా ఇంకా ఆడపిల్లల్ని తొక్కేస్తున్నారని, ఆడపిల్లల్ని తక్కువగా చూస్తున్నారని, చిరంజీవి లాంటి వ్యక్తే ఇలా అంటే సాధారణ ప్రజలు ఏమనుకుంటారని.. ఇలా రకరకాల విమర్శలు చేస్తూ చిరంజీవిని ట్రోల్ చేస్తున్నారు. ఇక మెగా ఫ్యాన్స్ మాత్రం ఇంట్లో అబ్బాయి ఉండాలని అనుకోవడం సహజం, సరదాగా అన్న మాటలను కూడా కావాలనే ఇలా విమర్శలు చేస్తున్నారని వాపోతున్నారు.

👉 Download our Android App
👉Download our IOS App
👉Follow us on Instagram
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed