MEGASTAR CHIRANJEEVI: నేడు పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు..

by Kavitha |
MEGASTAR CHIRANJEEVI: నేడు పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు..
X

దిశ, సినిమా: కొణిదెల శివశంకర వరప్రసాద్ అంటే చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు కానీ, మెగాస్టార్ చిరంజీవి అంటే మాత్రం తెలియని వారుండరు. ఆయన 1995 పశ్చిమ గోదావరి జిల్లాలోని మొగల్తూరులో అంజనా దేవీ, వెంకట్రావు అనే దంపతుల సంతానంగా ఆగస్టు 22వ తేదీన జన్మించారు. అయితే చిరంజీవి ‘పునాది రాళ్ళు’ అనే మూవీతో తన కెరీర్‌ను స్టార్ట్ చేశారు. ఆ తర్వాత వచ్చిన అన్ని అవకాశాలు అందిపుచ్చుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. అలా చిరంజీవి అతి తక్కువ టైమ్‌లోనే స్టార్ హీరోగా.. మంచి డ్యాన్సర్‌గా అందరిని ఆకట్టుకున్నారు. ఇక చిరంజీవి ‘ఖైదీ’ అనే సినిమాతో తన మొదటి విజయాన్ని ప్రారంభించి తెలుగు ప్రజలకు హీరో అంటే ఇలా ఉండాలి అనే ఊహను కలిగించినాడు. అక్కడ నుంచి చిరంజీవి తెలుగు సినిమా ఇండస్ట్రీకీ, కోటాను కోట్ల ఫ్యాన్స్‌ను తన యాక్టింగ్‌తో, డ్యాన్సులతో ఎంతగానో ప్రభావితం చేశాడు.

ఇప్పటికే చిరంజీవి 150 పైగా చిత్రాలలో నటించి తనకంటూ సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. అలాగే తెలుగు ప్రజల కోసం చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి బ్లడ్ బ్యాంక్ ద్వారా సామాన్య ప్రజలకు సేవలను అందిస్తూ గొప్ప మనసు చాటుకుంటున్నారు. అయితే చిరంజీవి తన అభిమానుల కోరిక మేరకు రాజకీయాల్లోకి వెళ్లి అక్కడ కూడా తన విజయాలను కొనసాగించారు. అంతేకాకుండా దేశ అత్యున్నత పురస్కారం అయిన పద్మవిభూషణ్ అనే అవార్డును కూడా కైవసం చేసుకున్నారు. అలా తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి నేడు తన 69వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు.

ఇదిలా ఉండగా.. చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి వశిష్ట మల్లిడి దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాలో త్రిషా కృష్ణన్, మీనాక్షి చౌదరీ, ఆషిక రంగనాథ్, సురభి, ఇషా చావ్లా, రమ్య పసుపులేటి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రం 2025 సంవత్సరం జనవరి 10వ తేదీన రిలీజ్ అవుతున్నది.


Advertisement

Next Story

Most Viewed