Sai Dharam Tej: ‘SDT18’ మూవీ నుంచి పవర్ ఫుల్ పోస్టర్ విడుదల.. స్పెషల్ అప్డేట్‌కు టైమ్ ఫిక్స్

by Hamsa |   ( Updated:2024-12-07 13:27:11.0  )
Sai Dharam Tej: ‘SDT18’ మూవీ నుంచి పవర్ ఫుల్ పోస్టర్ విడుదల.. స్పెషల్ అప్డేట్‌కు టైమ్ ఫిక్స్
X

దిశ, సినిమా: మెగా హీరో సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) గత ఏడాది ‘విరూపాక్ష’(Virupaksha) సినిమాతో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఆయన తన కొత్త ప్రాజెక్ట్‌ ‘SDT18’ను మొదలుపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంతోనే రోహిత్ కేపీ(Rohit KP) దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఇందులో ఐశ్వర్య లక్ష్మి(Aishwarya Lakshmi) హీరోయిన్‌గా నటిస్తుంది. దీనిని ‘హనుమాన్’(Hanuman) మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి(Niranjan Reddy), చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు.

షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి వరుస అప్డేట్స్ విడుదల చేస్తూ మేకర్స్ అంచనాలను పెంచుతున్నారు. తాజాగా, ‘SDT18’ నుంచి బిగ్ అప్డేట్(Big update) వచ్చింది. డిసెంబర్ 12న క్రేజీ అప్డేట్ విడుదల కాబోతున్నట్లు చేతిలో కత్తి పట్టుకుని ఉన్న ఓ పవర్‌ఫుల్ పోస్టర్‌ను షేర్ చేశారు. ‘‘ది ఫ్యూరీ రక్తపాత చరిత్ర గురించి మరింత వెల్లడిస్తుంది. మారణహోమం సృష్టించడానికి వస్తున్నాడు. డిసెంబర్ 12న SDT18 టైటిల్ రాబోతుంది. మరిన్ని మెగా భారీ అప్‌డేట్‌ల కోసం చూస్తూ ఉండండి’’ అనే క్యాప్షన్ జత చేశారు. అంతేకాకుండా ఫైర్ ఎమోజీలను షేర్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed