వరుణ్-లావణ్య పెళ్లికి భారీగా ఖర్చు పెట్టిన మెగా ఫ్యామిలీ.. ఎన్ని కోట్లంటే?

by Hamsa |   ( Updated:2023-11-03 11:20:07.0  )
వరుణ్-లావణ్య పెళ్లికి భారీగా ఖర్చు పెట్టిన మెగా ఫ్యామిలీ.. ఎన్ని కోట్లంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ‘మిస్టర్’ సినిమాతో ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత ఈ ఏడాది జూన్‌లో సడెన్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకుని అందరికీ షాకిచ్చారు. ఇక అప్పటి నుంచి వీరికి సంబంధించిన వార్తలు ఎన్నో వచ్చాయి. అలాగే నవంబర్ 1న ఇటలీలో వైవాహిక బంధంతో ఒకటయ్యారు. వీరికి పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. వరుణ్ ఒక్క పెళ్లి కార్డుకే రూ.6 లక్షలు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. అలాగే వీరి పెళ్లి బట్టలకు కూడా భారీగానే డబ్బులు ఖర్చు చేశారట.

తాజాగా, వీరి పెళ్లికి సంబంధించిన వార్త నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఈ వివాహం కోసం మెగా ఫ్యామిలీ భారీగానే ఖర్చు చేసినట్లు నెట్టింట చర్చలు జరుగుతున్నాయి. కాక్‌టైల్, హల్దీ, మెహందీ, పెళ్లీ.. ఇలా ప్రతి వెడుకను చాలా గ్రాండ్‌గా ఉండేలా ముందుగానే ప్లాన్ చేసుకున్నారు. ఈ పెళ్లి తమకే కాకుండా అందరికీ గుర్తుండిపోయేలా చేసుకోవాలనుకున్నారు. అందుకే ఖర్చుకు ఏమాత్రం ఆలోచించకుండా ఏకంగా రూ. 17 కోట్ల వరకు ఖర్చు చేశారట. ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ ఈ వార్త మాత్రం వైరల్ అవుతోంది. దీంతో ఈ విషయం తెలిసిన వారు.. విదేశాల్లో జరిగిన దానికి అంత పెడితే.. ఇక హైదరాబాద్‌లో జరిగే రిసెప్షన్‌కు ఇంకెంత ఖర్చు పెడతారో అని అనుకుంటున్నారు.

Read More..

వరుణ్- లావణ్య పెళ్లికి ఎన్టీఆర్ వెళ్లకపోవడానికి కారణం అదేనా?

వదినమ్మ వచ్చేసిందంటూ నిహారిక పోస్ట్.. అలాంటి కామెంట్స్ పెడుతూ రచ్చ చేస్తున్న నెటిజన్లు

Advertisement

Next Story