- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Meenakshi Chowdhury: కీలక నిర్ణయం తీసుకున్న మీనాక్షి చౌదరి.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్
దిశ, సినిమా: యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి(Meenakshi Chowdhury) వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇటీవల ‘లక్కీ భాస్కర్’(Lucky Bhaskar) మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం థియేటర్స్‌లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అంతేకాకుండా భారీ కలెక్షన్లు కూడా రాబట్టింది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ క్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మీనాక్షి చౌదరి కీలక నిర్ణయం(Key decision) తీసుకున్నట్లు వెల్లడించింది.
‘‘లక్కీ బాస్కర్ సినిమాలో దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan)కు భార్యగా నటించినందుకు నాకు ప్రశంసలు లభించాయి. కానీ కొందరు మాత్రం నన్ను భయపెడుతున్నారు. కెరీర్ ప్రారంభంలోనే ఇలా భార్యగా, బిడ్డకు తల్లిగా నటించకపోవడం చాలా మంచిదని నా స్నేహితులు సలహా ఇచ్చారు. ఇలా చేయడం వల్ల త్వరలోనే అక్క, అమ్మ పాత్రలకు పరిమితం చేస్తారని భయపెట్టారు. అందుకే ఇకపై హీరోకు భార్యగా, బిడ్డకు తల్లిగా నటించే పాత్రలను అంగీకరించకూడదని నిర్ణయించుకున్నాను. అలాగే యాక్షన్‌తో కూడి కమర్షియల్(Commercial) కథా చిత్రాల్లోనే నటించాలని కోరుకుంటున్నాను’’ అని చెప్పుకొచ్చింది.