Meenakshi Chaudhary: సిద్ధంగా ఉండండి.. ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లోకి రాబోతున్న హీరోయిన్ (పోస్ట్)

by sudharani |   ( Updated:2025-01-03 11:06:36.0  )
Meenakshi Chaudhary: సిద్ధంగా ఉండండి.. ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లోకి రాబోతున్న హీరోయిన్ (పోస్ట్)
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ మీనాక్షీ చౌదరి (Meenakshi Chaudhary) ప్రజెంట్ వరుస సినిమాలు చేస్తూ సందడి చేస్తుంది. ఇటీవల ‘లక్కీ భాస్కర్’ చిత్రంతో భారీ హిట్ అందుకున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం రెండు, మూడు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఇందులో ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఒకటి. విక్టరీ వెంకటేష్ (Venkatesh) హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి, ఐశ్వర్య రాజేష్ (Ashwarya Rajesh) హీరోయిన్లుగా నటిస్తున్నారు. అనిల్ రావిపూడి (Anil Ravipudi) డైరెక్షన్‌లో తెరకెక్కున్న ఈ మూవీ సంక్రాంతి స్పెషల్‌గా జనవరి 14న థియేటర్‌లలో సందడి చేయనుంది. దీంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచారు చిత్ర బృందం. ఇందులో భాగంగా తాజాగా మీనాక్షీ చౌదరి అభిమానుల ముందుకు రాబోతుంది.

‘ఇన్‌స్టాగ్రామ్ (Instagram) వేదికగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా గురించి మరిన్ని విశేషాలు మీతో పంచుకునేందుకు మీను మీ ముందుకు రాబోతుంది. మనోహరమైన సాయంత్రం కోసం మీరంతా సిద్ధంగా ఉండండి. ఈరోజు సాయంత్రం 6 గంటలకు మీను రాబోతుంది. మీరు మీ ప్రశ్నలతో సిద్ధంగా ఉండండి’ అని పోస్ట్ పెట్టారు. ప్రజెంట్ ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. కాగా.. ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్(Sri Venkateswara Creations) బ్యానర్‌పై దిల్ రాజు(Dil Raju ), శిరీష్ (Sirish) నిర్మిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed