- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Naga Chaitanya: మరికొన్ని గంటల్లో శోభితతో పెళ్లి.. హాట్ టాపిక్‌గా మారిన నాగచైతన్య పోస్ట్!
దిశ, సినిమా: అక్కినేని నాగార్జున(Nagarjuna) పెద్ద కుమారుడు నాగచైతన్య, హీరోయిన్ శోభిత(Sobhita Dhulipala)ను త్వరలో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. మరికొన్ని గంటల్లో అన్నపూర్ణ స్టూడియో(Annapurna Studio)లో వీరిద్దరు వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు. ఇప్పటికే ఇరు కుటుంబాలు పెళ్లిలో జరిగే వేడుకలు మొదలెట్టారు. మంగళ స్నానం, పసుపు పెట్టే ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అవుతున్నాయి.
ఈ క్రమంలో.. తాజాగా, నాగచైతన్య గతంలో పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. విడాకులు అయినా కూడా సమంత(Samantha)తో కలిసి ఉన్న రొమాంటిక్ పోస్టర్ డిలీట్ చేయకపోవడంతో అంతా దీని గురించే చర్చించుకుంటున్నారు. నాగచైతన్య 2019లో వచ్చిన ‘మజిలీ’(Majili) పోస్టర్‌ను అలాగే ఉంచాడు. అయితే విడాకుల తర్వాత సమంతతో కలిసి ఉన్న పిక్స్ అన్ని డిలీట్ చేసిన చైతు ‘మజిలీ’ ఫొటో ఉంచడంతో చర్చకు దారితీసింది.
మరికొన్ని గంటల్లో శోభితతో పెళ్లి పెట్టుకుని సమంతతో ఉన్న జ్ఞాపకాలు డిలీట్ చేయకుండా ఉంచడం ఏంటని? కొంతమంది అంటున్నారు. అయితే అక్కినేని అభిమానులు మాత్రం ఇది పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన పిక్ కాదని ఉంచాడని చైతుకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు. ప్రస్తుతం నాగచైతన్య పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read...
విడాకులు తీసుకున్నా.. సమంత కోసం ఇప్పటికీ ఆ పని చేస్తున్న నాగచైతన్య!