ఇంకా గాయం నుంచి కోలుకోకుండా వీల్ చైర్‌కే పరిమిత మయిన రష్మిక.. ఆందోళనలో ఫ్యాన్స్.. వీడియో వైరల్

by Kavitha |   ( Updated:2025-01-31 11:05:34.0  )
ఇంకా గాయం నుంచి కోలుకోకుండా వీల్ చైర్‌కే పరిమిత మయిన రష్మిక.. ఆందోళనలో ఫ్యాన్స్.. వీడియో వైరల్
X

దిశ, సినిమా: నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna), బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్(Vicky Kaushal) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఛావా’(Chhaava). లక్ష్మణ్ ఉటేకర్(Laxman Utekar) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దివ్యంజలి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దినేష్ విజయన్(Dinesh Vijayan) నిర్మిస్తున్నారు. ఇక ఛత్రపతి శివాజీ మహరాజ్‌ కుమారుడు శంభాజీ మహరాజ్‌ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిస్తున్న ఈ చిత్రంలో.. అక్షయ్‌ఖన్నా(Akshay Khanna), అశుతోష్ రాణా, దివ్య దత్తా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

అయితే ఈ మూవీ ఫిబ్రవరి 14న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. అయితే ఈ చిత్రంలో నేషనల్ క్రష్.. శంభాజీ భార్య యేసు భాయి పాత్రలో కనిపించనుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ప్రస్తుతం ప్రమోషన్ల బిజీలో ఉంది మూవీ టీమ్. ఇందులో భాగంగా తాజాగా హైదరాబాద్‌(Hyderabad)లో ‘జానే తూ’(Jaane Tu) సాంగ్‌ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమానికి హీరో విక్కీ కౌశల్‌తో పాటు రష్మిక కూడా హాజరయ్యారు. అయితే ఈ ఈవెంట్‌లో కూడా రష్మిక మందన్న వీల్ చైర్‌లోనే దర్శనమిచ్చారు.

ముందుగా సాంగ్ ప్లే చేసిన తర్వాత మరోసారి డ్యాన్సర్లతో డ్యాన్స్ చేయించి హీరోని ఆహ్వానించారు. ఆ తర్వాత హీరోయిన్‌ను కూడా స్టేజ్ మీదకు తీసుకెళ్ళారు. ఈ నేపథ్యంలోనే లైవ్‌లోనే సాంగ్‌కి హీరో హీరోయిన్ అభినయించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుండగా.. రష్మిక గాయం నుంచి ఇంకా కోలుకో లేనట్లుగా తెలుస్తోంది. దీంతో ఆమె ఫ్యాన్స్ రష్మిక త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. కాగా రీసెంట్‌గా జిమ్‌లో వర్క్ అవుట్స్ చేస్తున్న క్రమంలో ఈ భామ కాలికి గాయం అయిన సంగతి తెలిసిందే.

రీసెంట్‌గా ‘పుష్ప-2’(Pushpa-2)తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంది. రెయిన్ బో(Rainbow), ది గర్ల్ ఫ్రెండ్(The Girlfriend) వంటి చిత్రాల్లో నటిస్తోంది. మరోపక్క హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)తో సీక్రెట్ రిలేషన్ షిప్ నడిపిస్తోంది. ఈ నేపథ్యంలో అతనితో ‘VD-14’ మూవీలో కూడా ఈ రౌడీ హీరో సరసన నటిస్తున్నట్లు కొన్ని రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. కాగా వీరిద్దరూ నటించిన ‘గీత గోవిందం’(Geetha Govindam), ‘డియర్ కామ్రెడ్’(Dear Comrade) మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.

Next Story