పెళ్లికి ముందు అలా చేయొద్దని ఆడపడుచును హెచ్చరించిన లావణ్య?

by Hamsa |   ( Updated:2023-10-12 11:47:30.0  )
పెళ్లికి ముందు అలా చేయొద్దని ఆడపడుచును హెచ్చరించిన లావణ్య?
X

దిశ, వెబ్‌డెస్క్: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ఎంగేజ్‌మెంట్ చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరు పెద్దల సమక్షంలో త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఇటీవల ఈ కపుల్ ప్రీ వెడ్డింగ్ ఫొటో షూట్ కూడా చేసుకున్నారు. అందులో భాగంగానే చిరంజీవి , ఉపాసన, లావణ్య త్రిపాఠి , వరుణ్ తేజ్ అందరూ కూడా పెళ్లి డెకరేషన్ కి సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేశారు. ఇదిలా ఉంటే తాజాగా, లావణ్య త్రిపాఠి పెళ్లి ముందే నిహారికకు వార్నింగ్ ఇచ్చిందని ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇన్ని రోజులు బాగానే ఉన్నావు మధ్యలో ఇలా పొట్టి పొట్టి బట్టలు వేసుకుని ఎందుకు ప్రవర్తిస్తున్నావు. మొదటి నుంచి ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఉండి ఎక్స్పోజ్ చేస్తే ఎవరు అంతగా పట్టించుకోరు. కానీ ఇప్పుడు అలాంటి ఎక్స్పోజింగ్ చేస్తే మాత్రం మెగా ఫ్యామిలీ పై మీ నాన్న ,అన్నయ్య లపై విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుంది. ఇప్పటికే వాటిని నువ్వు చూసే ఉంటావు అంటూ హెచ్చరించిందట. కానీ మెగా డాటర్ నిహారిక మాత్రం వాటిని పట్టించుకుంటే జీవితంలో ముందుకు వెళ్ళలేము అని సమాధానమిచ్చిందట. ఇందులో నిజమెంత అనేది తెలియదు కానీ ఈ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో అది చూసిన నెటిజన్లు పెళ్లికి ముందే ఆడపడుచు పై పెత్తనం చెలాయిస్తుందని గుసగుసలాడుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed