మరో బంపరాఫర్ అందుకున్న కుంభమేళ బ్యూటీ.. ఏకంగా గ్లోబల్ స్టార్ సినిమాలో చాన్స్

by Kavitha |
మరో బంపరాఫర్ అందుకున్న కుంభమేళ బ్యూటీ.. ఏకంగా గ్లోబల్ స్టార్ సినిమాలో చాన్స్
X

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సనా(Buchi Babu Sana) కాంబోలో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ‘RC-16’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఇప్పటికీ షూటింగ్ స్టార్ట్ చేసుకున్న ఈ చిత్రం మైసూర్‌లో చరణ్‌పై కొన్ని కీలక మైన సన్నివేశాలు కూడా తెరకెక్కించారు మేకర్స్. ఇక రీసెంట్‌గా ఈ మూవీ షూటింగ్‌లో ప్రముఖ నటుడు జగపతిబాబు(Jagapathi Babu) కూడా పాల్గొన్నారు. అందుకు సంబంధించిన వీడియోను అతను ఇన్‌స్టా గ్రామ్‌లో పోస్ట్ చేయడంతో అందరికీ తెలిసింది.

ఇదిలా ఉంటే.. తేనె కళ్ల సుందరి మోనాలిసా భోంస్లే(Monalisa Bhosle) మరో బంపరాఫర్ అందుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఈ బ్యూటీ ఆర్ సీ-16 మూవీలో రామ్‌చరణ్‌తో కలిసి నటించబోతుందట. అయితే ఇప్పటికే జాన్వీకపూర్‌ను హీరోయిన్ ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో మోనాలిసాకు ఎలాంటి క్యారెక్టర్ ఇస్తారోనన్న ఆసక్తి రేపుతోంది. ఇక దేశవ్యాప్తంగా తన అందంతో యూత్‌ని మంత్ర ముగ్ధుల్ని చేస్తున్న మోనాలిసాకి ఈ సినిమాలో మంచి రోల్ పడితే మాత్రం..చరణ్ పాన్‌ ఇండియా సినిమాకు బాగా కలిసి వస్తుందంటున్నారు ఫ్యాన్స్. కాగా ఆమె అందానికి ఫిదా అయి బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా(Sanoj Mishra) ఇప్పటికీ తన సినిమాలో చాన్స్ ఇస్తానని వెల్లడించిన సంగతి తెలిసిందే.

Next Story