షారుఖ్, సల్మాన్, అమిర్ ఖాన్‌లకు కోలీవుడ్ యంగ్ హీరో వార్నింగ్.. వైరల్‌గా మారిన ట్వీట్.. అసలేం జరిగిందంటే?

by Hamsa |
షారుఖ్, సల్మాన్, అమిర్ ఖాన్‌లకు కోలీవుడ్ యంగ్ హీరో వార్నింగ్.. వైరల్‌గా మారిన ట్వీట్.. అసలేం జరిగిందంటే?
X

దిశ, సినిమా: కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘లవ్ టుడే’ (love today) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం ఊహించని రెస్పాన్స్‌ను దక్కించుకోవడంతో పాటుగా ప్రదీప్ పాపులారిటీ పెంచిందనడంలో అతిశయోక్తి లేదు. ఆ తర్వాత రెండున్నరేళ్ల తర్వాత ఇటీవల ‘డ్రాగన్’(Dragon) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అశ్వత్ వైరముత్తు(Ashwath Vairamuthu) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఫిబ్రవరి 21న తెలుగు, తమిళ భాషల్లో విడుదలై ఘన విజయాన్ని సాధించింది. దీంతో మూవీ మేకర్స్ మరికొన్ని భాషల్లోకి తీసుకురావాలనే ప్లాన్‌లో ఉన్నారు. తాజాగా, ‘డ్రాగన్’ చిత్రాన్ని హిందీలో రిలీజ్ చేయనున్నారు.

‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’(Return of the Dragon)ఈ సినిమాను మార్చి 14న థియేటర్స్‌లోకి తీసుకువస్తున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ ప్రదీప్ షాకింగ్ ట్వీట్ చేశాడు. అంతేకాకుండా ముగ్గురు స్టార్ హీరోలకు వార్నింగ్ ఇచ్చాడు. "నా సినిమాలను భారతదేశం మొత్తం చూడాలని ఎప్పుడూ కోరుకునే వాడిని. ఇదిగో మా మొదటి అడుగు. అమిర్ ఖాన్(Aamir Khan), సల్మాన్ ఖాన్(Salman Khan), షారుఖ్ ఖాన్(Shahrukh Khan).. జాగ్రత్తగా ఉండండి, నేను వస్తున్నాను’’ అని రాసుకొచ్చాడు. అలాగే స్మైల్ ఎమోజీలు షేర్ చేస్తూ హిందీట్రైలర్‌ను షేర్ చేశాడు. ప్రస్తుతం ప్రదీప్ పోస్ట్ నెట్టింట చక్కర్లు కొడుతుండగా.. నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. హిందీలోనూ ఈ సినిమా హిట్ కావడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు.

Next Story