- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డైరెక్ట్ ఓటీటీలోకి రాబోతున్న కమల్ హాసన్ ‘ఇండియన్-3’ మూవీ.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?
దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్, డైరెక్టర్ శంకర్ కాంబోలో వచ్చిన ‘ఇండియన్’ మూవీ 1996లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు సిక్వెల్‌గా ‘ఇండియన్-2’ 2024 జూలై 12న థియేటర్స్‌లో విడుదలై డిజాస్టర్‌గా నిలిచింది. అంతేకాకుండా సోషల్ మీడియాలోనూ పలు విమర్శలు ఎదుర్కొంది. ఈ చిత్రం ఓటీటీలో కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అయితే ఇప్పటికే ఇండియన్-2కు సీక్వెల్ తెరకెక్కబోతున్నట్లు పలు వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. తాజాగా, ఇండియన్-2 సీక్వెల్ విషయంలో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఓ వార్త వైరల్ అవుతోంది.
ఇండియన్-3ని డైరెక్ట్ ఓటీటీలో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు టాక్. అయితే దీని కోసం నిర్మాణ సంస్థ ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌తో చర్చలు జరుపుతున్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. అంతేకాకుండా 2025 జనవరి 14న ‘ఇండియన్-3’ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అందుబాటులోకి కూడా రానున్నట్లు పలు పోస్టులు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. దీంతో ఈ విషయం తెలుసుకున్న కమల్ హాసన్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. అయితే దీనిపై ఇండియన్-3 చిత్రబృందం కానీ నెట్‌ఫ్లిక్స్ కానీ రియాక్ట్ కాలేదు.