- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Johnny Master: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు బిగ్ రిలీఫ్.. ఎట్టకేలకు రెగ్యులర్ బెయిల్ మంజూరు
దిశ, వెబ్‌డెస్క్: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు ఎట్టకేలకు బెయిల్ మంజూరైంది. తెలంగాణ హైకోర్టు జానీ మాస్టర్‌కు షరతులతో కూడిన రెగ్యులర్ బెయిల్‌ను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. లేడీ కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్‌ను నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే కేసులో ఆయన గత రెండు వారాలుగా చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
కాగా, ఇటీవలే జానీ మాస్టర్ తనకు వచ్చిన జాతీయ అవార్డు (National Award)ను తీసుకునేందుకు రంగారెడ్డి జిల్లా ఫోక్సో కోర్టు (Ranga Reddy Distrcit Pocso Court)లో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కోర్టు ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకుని అక్టోబర్ 6 నుంచి అక్టోబర్ 9 వరకు నాలుగు రోజుల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే, అనూహ్యంగా ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణల కేసు నమోదు కావడంతో జానీ మాస్టర్ (Johnny Master)కు రావాల్సిన నేషనల్ అవార్డును రద్దు చేశారు. ఆ తదనంతర పరిణామాలతో ఆయన బెయిల్ కూడా రద్దు అయింది. ఇక చేసేదేమి లేక కేసులో ఇక మధ్యంతర బెయిల్ తీసుకోనని జానీ మాస్టర్ కోర్టులో మెమో దాఖలు చేశారు. ఆ మెమోపై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం ఆయనకు ఇవాళ రెగ్యులర్ బెయిల్ (Regular Bail)ను మంజూరు చేసింది.