Janhvi Kapoor: పుష్ టు స్టార్ట్ అంటూ జాన్వీ కపూర్ పోస్ట్.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన సీతారామం బ్యూటీ

by Kavitha |   ( Updated:2024-12-10 10:58:22.0  )
Janhvi Kapoor: పుష్ టు స్టార్ట్ అంటూ జాన్వీ కపూర్ పోస్ట్.. అదిరిపోయే రిప్లై ఇచ్చిన సీతారామం బ్యూటీ
X

దిశ, సినిమా: అతిలోక సుందరి శ్రీదేవి(Sridevi) తనయురాలు, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr.NTR) సరసన ‘దేవర’(Devara) మూవీలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతోనే ఈ భామ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) సరసన ఓ సినిమాలో నటిస్తోంది. అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన అందాలతో అదరహో అనిపిస్తోంది. ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది.

తాజాగా జాన్వీ కపూర్ తన ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. అందులో గ్రే(Gray) కలర్ డ్రెస్ వేసుకొని వయ్యారంగా చూస్తూ ఫొటోలకి పోజులిచ్చింది. అంతేకాకుండా వాటికి ‘ఫుష్ టు స్టార్ట్’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక దీనిపై ‘సీతా రామం’(Seetharamam) బ్యూటీ మృణాల్(Mrunal) ఫైర్ ఎమోజీని రిప్లై‌గా ఇచ్చింది. మరి మీరు ఈ పోస్ట్ పై ఓ లుక్ వేసేయండి.

Next Story

Most Viewed