Janvi Kapoor: హార్దిక్ పాండ్యాతో జాన్వీ కపూర్ డేటింగ్.. బయటపడ్డ అసలు నిజం? (పోస్ట్)

by Hamsa |
Janvi Kapoor: హార్దిక్ పాండ్యాతో జాన్వీ కపూర్ డేటింగ్.. బయటపడ్డ అసలు నిజం? (పోస్ట్)
X

దిశ, సినిమా: క్రికెటర్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya), దేవర హీరోయిన్ జాన్వీ కపూర్(Janvi Kapoor) డేటింగ్ చేస్తున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాకుండా ఇద్దరు కలిసి బీచ్‌లో ఎంజాయ్ చేస్తు్న్న పలు ఫొటోలు కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. మాల్దీవుల్లో విహరించినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలుసుకున్న వారంతా షాక్‌కు గురవుతున్నారు. వీరిద్దరి ఫొటోలు చూసి నిజమే అని అంతా అనుకున్నారు. ఇక ఇది నిజమా కాదా అని అభిమానులు దీనిపై సెర్చింగ్ మొదలు పెట్టగా అసలు నిజం బయటకు వచ్చింది.

అసలేం జరిగిందో ఇక్కడ తెలుసుకుందాం.. హార్దిక్ పాండ్యా, జాన్వీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(Artificial Intelligence) ఏఐ సాయంతో క్రియేట్ చేసిన ఫొటోలుగా తేలింది. వీరిద్దరు డేటింగ్‌లో ఉన్నారంటూ వచ్చిన వార్తలు కేవలం పుకార్లే అని తేలిపోయింది. దీంతో వీరిద్దరి అభిమానులు కాస్త ఊపిరిపీల్చుకున్నారు. కాగా, ఇటీవల హార్దిక్ పాండ్యా తన భార్యతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ తన కొడుకు కోసం భార్యతో కలిసి వెకేషన్స్‌కు కూడా వెళ్తున్నారు.

Next Story

Most Viewed