- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
‘గేమ్ ఛేంజర్’ సినిమాపై జనసేన నేత కామెంట్స్

దిశ, వెబ్‌డెస్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) నటించిన ‘గేమ్ ఛేంజర్’ సినిమా(Game Changer Movie) ఈనెల 10వ తేదీన విడుదలై మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నది. అవినీతి లేని ప్రభుత్వాన్ని నడించాలనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని దర్శకుడు శంకర్(Shankar) తెరకెక్కించారు. తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన జనసేన బొలిశెట్టి సత్యనారాయణ(Bolisetty Satyanarayana) రివ్యూ ఇచ్చారు. ‘ప్రజలు తలచుకుంటే డబ్బు లేని రాజకీయాలు ఎలా సాధ్యమవుతాయో.. ఒక పోలీసు అధికారి ఏం చేయగలరో.. ఒక జిల్లా కలెక్టర్ ఏం చేయగలరో.. అలాగే ఒక ఎలక్షన్ ఆఫీసర్ ఏం చేయగలరో సినిమాలో చక్కగా చూపించారు. నిజజీవితంలో పవన్ కల్యాణ్(Pawan Kalyan) కూడా అవినీతిపై రాజీలేని పోరాటం చేస్తున్నారు.
రాజకీయ పార్టీని కూడా అలాగే నడిపిస్తున్నారు. ఇదే విషయాన్ని దర్శకుడు శంకర్ అద్భుతంగా చూపించే ప్రయత్నం చేశారని బొలిశెట్టి సత్యానారాయణ అన్నారు. సినిమాలో ఎవరి పాత్రలో వారు అందరూ అద్భుతంగా చేశారని కితాబిచ్చారు. ఇదిలా ఉండగా.. గేమ్ ఛేంజర్ సినిమాకు తొలిరోజు భారీ స్థాయిలో కలెక్షన్లు వచ్చాయి. వరల్డ్‌వైడ్‌గా తొలిరోజు సుమారు రూ.186 కోట్లు వసుళ్లు సాధించినట్లు నిర్మాణ సంస్థ ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా తెలిపింది. మరోవైపు ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ అయిన బుక్ మై షోలో 'గేమ్ ఛేంజర్'కు తొలి రోజు 1.3 మిలియన్లకు పైగా టికెట్స్ అమ్ముడైనట్లు ఆ సంస్థ వెల్లడించింది.