జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ భార్య సీమంతం.. నెట్టింట వైరల్ అవుతున్న క్యూట్ ఫొటోలు

by Kavitha |   ( Updated:2024-09-12 15:06:46.0  )
జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ భార్య సీమంతం.. నెట్టింట వైరల్ అవుతున్న క్యూట్ ఫొటోలు
X

దిశ, వెబ్‌డెస్క్: జబర్దస్త్ షో (jabardasth show)ద్వారా చాలామంది పాపులారిటీ సంపాదించుకున్నారు. అలా ఫేమస్ అయిన వారిలో రాకింగ్ రాకేష్(rocking rakesh), సుజాత(sujatha) కూడా ఉన్నారు. మిమిక్రీ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలుపెట్టిన రాకింగ్ రాకేష్.. ఆ తర్వాత జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చి టీం లీడర్‌గా(team leader) ఎదిగి మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం సినిమాల్లో పాత్రలు చేస్తున్నాడు. ఇక టీవీ యాంకర్‌గా పనిచేసే సుజాత బిగ్ బాస్ షోలో పాల్గొని బాగా పాపులర్ అయింది. ఇక బిగ్ బాస్(bigg boss) నుంచి బయటకు వచ్చాక జబర్దస్త్ షో తో మరింత ఫేమ్ తెచ్చుకుంది. అలా జబర్దస్త్‌లో పరిచయమైన రాకింగ్ రాకేష్ – సుజాత కొన్నాళ్ళు ప్రేమించుకొని గత సంవత్సరం ఫిబ్రవరిలో పెళ్లి(marriage) చేసుకున్నారు. ఇప్పుడు ఈ జబర్దస్త్ జంట త్వరలో తల్లిదండ్రులు(parents) కాబోతున్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా రాకింగ్ రాకేష్ తన భార్య(సుజాత) సీమంతం ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. అందులో సుజాత ఎంతో చూడముచ్చటగా ఉంది. అంతేకాకుండా "ఈ సమయంలో తన ఆనందాన్ని చూస్తుంటే నా ఆనందానికి అవధులు లేవు.. నీ మీద నా ప్రేమకు అవధులు లేవు" అనే క్యాప్షన్‌ను కూడా జోడించాడు. కాగా ఈ సీమంతం ఫంక్షన్‌కు చాలా మంది నటీనటులతో పాటు దగ్గరి బంధువులు హాజరైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అది చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

(video link credits to jabardasth rakesh instagram id)

Advertisement

Next Story

Most Viewed